హిందువులు మైనార్టీలుగా మారిపోతున్నారా?
x

హిందువులు మైనార్టీలుగా మారిపోతున్నారా?

క్రైస్తవ మతంలోకి మారడాన్ని తక్షణమే ఆపకపోతే దేశంలో హిందువులు మైనార్టీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.


క్రైస్తవ మతంలోకి మారడాన్నితక్షణమే ఆపకపోతే దేశంలోని హిందువులంతా మైనార్టీలుగా మారిపోతారని అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

రాంఫాల్ మతం మారాడా?

మానసిక వ్యాధితో బాధపడుతున్న రాంఫాల్ అనే వ్యక్తిని కైలాష్ ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక వారం పాటు చికిత్స చేయించి తీసుకొస్తానని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారం గడిచినా రాంఫాల్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నుంచి చాలా మందిని ఢిల్లీకి తీసుకెళ్లి క్రైస్తవ మతంలోకి మార్చాడన్న ఆరోపణలతో కైలాష్‌పై పోలీసులు కిడ్నాప్, మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

నిన్నటి రోజున కైలాష్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది.

రాంఫాల్ తరుపున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పీకే గిరి మాట్లాడుతూ..ఇలాంటి సభలకు వెళ్లిన ప్రజలు పెద్ద సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారుతున్నారని కోర్టుకు వివరించారు. హమీర్ పూర్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిన కైలాష్‌కు డబ్బు కూడా చెల్లిస్తున్నారని వాదించారు.

కైలాష్‌ తరపు న్యాయవాది సాకేత్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. రాంఫాల్‌ క్రైస్తవ మతంలోకి మారలేదని, కేవలం క్రైస్తవ సమావేశానికి మాత్రమే హాజరయ్యారని తెలిపారు.

'ప్రచారం' అనే పదానికి ప్రచారం కల్పించడం అని అర్థం. ఏ వ్యక్తిని అతని మతం నుంచి మరొక మతంలోకి మార్చడం కాదు" అని పేర్కొన్న కోర్టు ..కైలాష్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు తిరస్కరించింది.

Read More
Next Story