యమునా జలాలు.. బీజేపీ వర్సెస్ ఆప్
‘‘హర్యాణ సీఎం సైనీ యమునా నీటిని తాగకుండా ఉమ్మేశారు.. కేజ్రీవాల్’’ ‘‘అసలు వీడియోను షేర్ చేయండి..ఎడిట్ చేసింది కాదు..బీజేపీ కౌంటర్’’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీతో కయ్యానికి కాలుదువ్వుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ(AAP). బీజేపీ(BJP) పాలిత రాష్ట్రం హర్యాణ నుంచి ఢిల్లీకి వచ్చే యమునా నది జలాల్లో పరిమితికి మించి అమ్మోనియా లెవల్స్ ఉంటున్నాయని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
హర్యానా సీఎం సైనీ(Haryana CM Saini) యమునా నీటిని(Yamuna water) తాగినట్లు నటించారు. వాస్తవానికి ఆ నీటిని నదిలోకి తిరిగి ఉమ్మేశారని ఆరోపిస్తూ.. కేజ్రీవాల్(Kejriwal) వీడియోను ట్యాగ్ చేశారు. పరిమితిని మించి యమునా నీటిలో కలిసి వస్తోన్న అమోనియా..ఢిల్లీ వాసుల జీవితాలకు ప్రమాదకరమని చెబితే.. నా మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ బెదిరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी ने यमुना का पानी पीने का ढोंग किया… और फिर वही पानी वापस यमुना में थूक दिया।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2025
जब मैंने कहा कि अमोनिया की मिलावट के कारण यमुना का पानी दिल्लीवालों की जान के लिए ख़तरा हो सकता है, तो इन्होंने मुझ पर FIR करने की धमकी दी।
जिस ज़हरीले पानी… pic.twitter.com/xQEVAu9bWh
బీజేపీ కౌంటర్..
యమునా నీటిని తాగుతున్న సైనీ అసలైన వీడియోను కాకుండా, ఎడిట్ చేసిన వీడియోను కేజ్రీవాల్ షేర్ చేశారని పేర్కొంది. "కేజ్రీవాల్ గారూ.. అబద్ధాలు కట్టిపెట్టండి..ఆ వీడియోను మరోసారి ఓపిగ్గా చూడండి. మీకు నిజంగా ధైర్యముంటే.. ఢిల్లీ వైపు ఉన్న యమునా నీటిని తాగడానికి ప్రయత్నించండి," అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
ఆధారాలు చూపాలన్న ఈసీ..
యమునా నీటిని హర్యాణ ప్రభుత్వం విషపూరితం చేసిందనే ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం (EC) కేజ్రివాల్‌ను కోరింది. దీంతో ఆయన 14 పేజీల లేఖతో పాటు నదిలో కాలుష్య స్థాయికి సూచించే డేటాను జతపరిచారు. ఎన్నికల నియమావళికి తాను ఎలాంటి భంగం కలిగించలేదని పేర్కొంటూ.. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం హర్యాణా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేజ్రీవాల్.
రాహుల్ రిప్లై ఏంటి?
కేజ్రీవాల్ ఆరోపణలపై బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడికి దిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.."కేజ్రివాల్ ఐదేళ్ల క్రితమే యమునా నది నీటిని తాగడంతో పాటుగా స్నానం కూడా చేస్తానని చెప్పారని, అయితే ఇప్పటి వరకు చేయలేదు," అని ఎద్దేవా చేశారు.