Manmohan | కాసేపట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
x

Manmohan | కాసేపట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈ రోజు (శనివారం) ఉదయం 11:45 గంటలకు నిర్వహించనున్నారు.


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఈ రోజు (శనివారం) ఉదయం 11:45 గంటలకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, రాజకీయాల గడ్డు ప్రపంచంలో ఏకాభిప్రాయ నిర్మాతగా పేరుతెచ్చుకున్న మన్మోహన్ సింగ్.. గురువారం (డిసెంబర్ 26) రాత్రి న్యూఢిల్లీలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయసు 92.

"మన్మోహన్ సింగ్ అమర్ రహే" నినాదాల మధ్య సింగ్ పార్థివ దేహాన్ని పూలమాలలతో అలంకరించిన ప్రత్యేక వాహనం కాసేపటి క్రితం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరింది. వందలాది మంది సింగ్ శ్రేయోభిలాషులతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు "జబ్ తక్ సూరజ్ చంద్ రహేగా, తబ్ తక్ తేరా నామ్ రహేగా" అంటూ వాహనం వెంట కదిలారు. కాంగ్రెస్ మాజీ చీఫ్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

Read More
Next Story