బీహార్ ఎన్నికలు: జయాపజయాలను మలువుతిప్పే అంశాలేంటి?
x

బీహార్ ఎన్నికలు: జయాపజయాలను మలువుతిప్పే అంశాలేంటి?

పోటీపోటీగా ఎన్నికల బరిలో ఎన్డీఏ కూటమి, మహాఘటబంధన్ కూటమి..


Click the Play button to hear this message in audio format

బీహార్‌ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు(Assembly polls) డేట్ ఫిక్సయ్యింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 14వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నితీష్ కుమార్ జేడీ(యూ), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ఆర్జెడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘటబంధన్ కూటమి మధ్య ప్రధాన పోరు జరగనున్న నేపథ్యంలో ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్ శ్రీనివాసన్ పలు అంశాలపై మాట్లాడారు. ఈసారి నిజమైన పోటీ కేవలం పొత్తుల మధ్య కాదు. ఇది వారసత్వం, మార్పు మధ్య ఉంటుంది." అని చెప్పారు. "2020 ఎన్నికలలో రెండు కూటములు ఒకే శాతం (37.2 %) ఓట్లను సాధించాయి. స్ట్రైక్‌రేట్‌లో వ్యత్యాసం ఉంది. బీజేపీ 67 శాతం సామర్థ్యంతో 74 సీట్ల దక్కించుకుంది. జేడీ(యూ) కేవలం 43 మాత్రమే సాధించింది." అని వివరించారు.

‘కింగ్ కాదు.. కింగ్ మేకర్..’

ఈ ఎన్నికల్లో మాజీ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్‌ గురించి శ్రీనివాసన్ మాట్లాడారు. ‘‘600 రోజుల్లో బీహార్‌లోని 2,500 గ్రామాల్లో పర్యటించారు. లాలూ సాధికారతకు, నితీష్ పాలనకు ప్రాతినిధ్యం వహించారు. కాని ప్రశాంత్ ఆశయం కోసం పనిచేస్తున్నాడు. కులం, మతం జోలికి వెళ్లకుండా విద్యావంతులు, నిరుద్యోగ యువతను ఆకట్టుకోగలుగుతున్నాడు. అయినప్పటికీ బీహార్‌లో ఓటర్లను తమవైపు తిప్పుకోవడం అంత ఈజీ కాదంటున్నారు శ్రీనివాసన్. చిరాగ్ పాస్వాన్ పార్టీ 2020లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ 33 నియోజకవర్గాల్లో జేడీ(యూ)ను దెబ్బతీసింది. కిషోర్ కూడా ఇలాంటి పాత్ర పోషించగలడు - ఆయన కింగ్ కాదు, కింగ్ మేకర్." అని పేర్కొన్నారు.


‘మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు..’

పాలక పక్షం నితీష్ మహిళా ఓటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. “2020లో మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే 5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉంది” అని శ్రీనివాసన్ ఎత్తి చూపారు. “ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన వంటి పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలు లంచంగా అభివర్ణించినా.. స్వయం సహాయక సంఘాల ప్రతి సభ్యురాలి బ్యాంకు ఖాతాలో రూ. 10వేలు జమ చేస్తున్నారు.’’ అని చెప్పారు.

తల్లిదండ్రుల పాలనా ముద్ర"జంగిల్ రాజ్" తన మీద పడకుండా ఉండేందుకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్. ఇక నితీష్ విషయానికొస్తే..తన ఆరోగ్యం, పార్టీ క్షీణత దృష్ట్యా పార్టీ మనుగడ కోసం ఆయన పోరాటం గతంలో ఎన్నడూ చేయలేదని పేర్కొన్నారు శ్రీనివాసన్.

Read More
Next Story