BJP | ఫిబ్రవరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త అధ్యక్షుడి నియామకం ఫిబ్రవరిలోగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పదవిలో జేపీ నడ్డా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త అధ్యక్షుడి నియామకం ఫిబ్రవరిలోగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పదవిలో జేపీ నడ్డా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 60 శాతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, జనవరి మాసంలో కొత్త వారిని నియమించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
బీజేపీ కొత్త అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి కావచ్చా? అని అడిగిన ప్రశ్నకు.. అది ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా సంస్థ నుంచి కావచ్చని సమాధానమిచ్చారు. యాదృచ్ఛికంగా కేంద్ర ఆరోగ్య మంత్రి అయిన నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం మూడేళ్లే అయినప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆయన పదవీకాలాన్ని పొడిగించింది.