
ED దాడులను మమతా అనుకూలంగా మార్చుకుంటున్నారా?
పాత బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకేనంటున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)–ఐప్యాక్ (I-PAC) మధ్య జరిగిన ఘర్షణను పశ్చిమ బెంగాల్(West bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని బలహీనపరచేందుకు బీజేపీ(BJP) పన్నిన వ్యూహంగా మమత చిత్రిస్తున్నారు.
ఎన్నికలలో టీఎంసీ అనుసరించాల్సిన వ్యూహం, సోషల్ మీడియా ప్రమోషన్, పార్టీకి సంబంధించిన కీలక డేటా ఐప్యాక్ వద్ద ఉంది. ఈ సమాచారం కోసమే ED ఐ ప్యాక్ కార్యాలయంపై దాడి చేసిందని మమత ఆరోపిస్తున్నారు. అయితే ED వాదన మరోలా ఉంది. పాత బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకే తనిఖీ చేశామని, రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వివాదం బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది.
ఐ-ప్యాక్ వద్ద TMC ఎన్నికల డేటా..
I-PACను ప్రతీక్ జైన్ నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి ఈ కన్సల్టెన్సీని స్థాపించారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)కి ప్రశాంత్ సాయపడ్డారు. 2014లో మోదీ ప్రచార బాధ్యతను కూడా ప్రశాంత్ కిషోర్ చూశారు. జన్ సురాజ్ పార్టీ స్థాపన తర్వాత ఆయన పూర్తిగా బిజీ కావడంతో కన్సల్టెన్సీ నుంచి విడిపోయారు.
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జరుగుతున్న సమయంలో గురువారం జరిగిన దాడి గమనార్హం. I-PAC వద్ద అలాంటి డేటా ఉందా? లేదా? అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశం. మమత ఇప్పటివరకు దీని గురించి మాట్లాడలేదు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వేసే ఎలాంటి వ్యూహాలకైనా మమత సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

