
కేరళలో S.I.R షెడ్యూల్ తేదీని పొడిగించిన ఈసీ
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్న ఈసీ
కేరళ(Kerala) ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R) షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వారం పొడిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలు డిసెంబర్ 9, 11 తేదీలలో రెండు దశల్లో జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
కాగా ఎన్యుమరేషన్ ఫారాల తుది గడువు తేదీని పొడిగించాలని యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేరళ ఎమ్మెల్యే PK కున్హాలికుట్టి సుప్రీం కోర్టులో పిటిషన్ చేశారు. పరిశీలించిన న్యాయస్థానం గడువు పొడిగించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 16న ప్రచురించాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితా డిసెంబర్ 23న ప్రచురితమవుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఫిబ్రవరి 14, 2026న తుది ఓటరు జాబితాను ప్రచురితమవుతుందని, డిసెంబర్ 18 వరకు ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ చేయవచ్చని పేర్కొంది. S.I.R జరుగుతోన్న రాష్ట్రాల్లో B.L.Oలు తీవ్ర పని ఒత్తిడి కారణంగా అనారోగ్యం బారిన పడుతుండడంతో నవంబర్ 30న భారతదేశం అంతటా S.I.R షెడ్యూల్‌ను ECI వారం పొడిగించిన విషయం తెలిసిందే.

