బెంగాల్: ముర్షిదాబాద్ అల్లర్ల వెనక ఉన్న శక్తులేంటీ?
x
బెంగాల్ హింస జరిగిన ప్రాంతం

బెంగాల్: ముర్షిదాబాద్ అల్లర్ల వెనక ఉన్న శక్తులేంటీ?

వక్ఫ్ ఆందోళనల పేరిట ఓ వర్గం ప్రజలపై విధ్వంసం సాగించిన నిరసనకారులు


(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)

బెంగాల్ లో జరుగుతున్న వక్ఫ్ వ్యతిరేక నిరసనలు క్రమంగా ఓ వర్గంపై దాడిగా మారాయి. ఈ దాడులను చూస్తే కొన్ని సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసలో హిందువులతో పాటు కొన్ని వర్గాల ముస్లింలు సైతం బాధితులుగా ఉన్నారు.
వారంతా అధికార పార్టీ టీఎంసీకి చెందిన నాయకులు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులు చాలా ప్రాంతాల్లో ఆందోళనల పేరిట హింసకు దిగడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీఎస్ఎఫ్ ఇచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం ఈ హింసకు ఎక్కువగా ఎక్స్ టర్నల్ హ్యాండ్ ఉందని తెలిపింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన మతోన్మాద శక్తులు, ఇక్కడ ఉన్న మతోన్మాద జిహాద్ శక్తులతో కలిసి బెంగాల్ లో ఓ వర్గంపై మారణకాండకు తెరతీశాయి.
ఈ ఆందోళనలలో ఫరక్కా ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లామ్ కు చెందిన ఇంటిని ఆందోళనకారులు పూర్తిగా ధ్వంసం చేశారు. అతని కుటుంబ సభ్యులను బలవంతంగా బయటకు పంపించివేశారు.
మత హింస కాదు..
‘‘ఇది కచ్చితంగా మత సంబంధమైన దాడులు కాదు. ఇక్కడ హిందూ, ముస్లింలతో సంబంధం లేకుండా భీభత్సం జరిగింది. ’’ అని ఇస్లామ్ ‘ది ఫెడరల్’ తో చెప్పారు. టీఎంసీ ఎంపీ ఖలీలూర్ రెహమాన్ సంబంధించిన ఆఫీస్ ను సైతం వక్ఫ్ ఆందోళనకారులు నామరూపాల్లేకుండా చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుల్లో ఇరవై శాతం దాకా మైనారిటీలు ఉన్నారు. ఎనభై శాతం మంది మరో వర్గం అమాయకపు ప్రజలు ఉన్నారు.
బాధితుల్లో ఒకరైన హుమాయున్ మాట్లాడుతూ.. ధులియా బజార్ లో ఉన్న తన స్వీట్ షాపును శుక్రవారం వక్ఫ్ నిరసనకారులు ధ్వంసం చేసి, పూర్తిగా లూటీ చేశారని చెప్పారు. కొంతమంది నిరసనకారులు చేతుల్లో ఆయుధాలు చేతపట్టుకుని మార్కెట్ లో నానా భీభత్సం చేశారని మీడియా ముందు చెప్పారు.
ప్రస్తుతం నిరసన జరుగుతున్న ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. అక్కడ, ఇక్కడ కూడా ఒకే భాష మాట్లాడే ప్రజలు ఉండటంతో నిరసనకారుల్లో బంగ్లా బ్యాచ్ చేరి విధ్వంసం సృష్టించి ఉండవచ్చని మరో టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అన్నారు. ఇంటలిజెన్స్ ఎస్పీ కూడా ఈ విషయం కూపీ లాగుతున్నారని అన్నారు.
ఈ విదేశీ శక్తులు ఎవరయి ఉంటారూ?
బంగ్లాదేశ్లోని రాజ్ షామి డివిజన్ నుంచి ముర్షిదాబాద్ జిల్లాకు చేరుకోవడానికి ‘పద్మా’నదిని దాటితే సరిపోతుంది. ఇది నదీ కాబట్టి కంచే లేదని కబీర్ అన్నారు. బీఎస్ఎఫ్ అంతర్గత నివేదిక కూడా ఇదే విషయాన్ని సూచిస్తుందన్నారు.
ముర్షిదాబాద్ లో ఓ వర్గానికి చెందిన తండ్రి కొడుకులను వక్ఫ్ ఆందోళనల పేరిటి నరికి చంపారు. అలాగే పోలీస్ వాహానాలను తగలబెట్టారు. అక్కడ హింసను చూస్తుంటే బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లను పోలీ ఉన్నాయి.
‘‘హింస వెనక ఉన్న కుట్రపై సమగ్ర దర్యాప్తు జరగాలి. నిఘా సంస్థలు ఆ కుట్రను వెలికితీయాలి’’ అని కబీర్ ఫోన్ లో అన్నారు. ఆయన బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన రాసిన లేఖలో పేర్కొన్నారు.
భద్రతా లోపాలు..
కుట్ర సిద్దాంతంలో ఉన్న ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. బయటి వ్యక్తులు స్థానిక నిరసనకారుల్లో ఎలా కలిసిపోయారు? వీరిని పోలీసులు, నిర్వాహకులు ఎలా గుర్తించలేకపోయారు? ఆ అంశంపై టీఎంసీ సభ్యులే పార్టీని, పోలీసులను నిందిస్తున్నారు.
‘‘పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది. ఆ ప్రాంతంపు మన ఎన్నికైనా ప్రతినిధులు నిరసనల నిర్వాహాకులతో సంప్రదింపులు జరిపి ఉంటే ఆ దురదృష్టకర సంఘటనను నివారించవచ్చు’’ అని కబీర్ అన్నారు.
వక్ఫ్ కు వ్యతిరేకంగా మైనారిటీలు చేసే నిరసనలు హింసాత్మకంగా మారవని భావించడం ద్వారా ఆ పార్టీ స్వీయ లక్ష్యాన్ని నిర్ధేశించికుందనే సాధారణ భావన టీఎంసీలోని ఒక వర్గంలో గూడుకట్టుకుని ఉంది. అందుకే నిరసనల పేరిట యథేచ్చగా విధ్వంసకాండ జరిగింది.
వక్ఫ్ చట్టం ఆమోదం పొందిన తరువాత శుక్రవారం జరిగిన నిరసనల్లో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగవని అనుకుని చాలాతక్కువ మంది పోలీసులను మోహరించారు.
ఏప్రిల్ 8న జిల్లాలోని జంగిపూర్ ప్రాంతంలో వక్ఫ్ వ్యతిరేక నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడినందున, పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందస్తుగా భారీ సంఖ్యలో బలగాలను సమీకరించుకోవాల్సి ఉండేది. కానీ అలాంటివేవీ జరగలేదు.
టీఎంసీ పూర్తిగా విఫలం
జంగీపూర్, ధులియాన్ వద్ద హింసను నియంత్రించడానికి ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను, ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ కు చెందిన 480 మంది సిబ్బంది, జనరల్ ఫోర్స్ కు చెందిన 300 మంది సభ్యులను మాత్రమే మోహరించారని తెలిసింది. అయితే నిరసనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో హింసను అడ్డుకోవడం పోలీసుల వల్ల కాలేదు.
రాజకీయంగా కూడా పార్టీ పూర్తిగా ఏం జరుగుతుందో అంచనావేయలేకపోయిందని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత ఎండీ సాదుద్దీన్ అన్నారు.
టీఎంసీ జిల్లా యూనిట్ లో అంతర్గత కలహాలు, వర్గ విభేదాలు ఎదుర్కోవడంలో పార్టీ హైకమాండ్ వైఫల్యమే రాజకీయ వైఫల్యానికి ప్రధానకారణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 8న జిల్లాలో తొలి ఉద్రిక్తత తరువాత పార్టీ మొదట్లో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే కబీర్ కు పేస్ మేకర్ పాత్రను అప్పగించిందని చాలా మంది టీఎంసీ నాయకులు చెబుతున్నారు.
ఒక నెల క్రితమే కబీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేసి మతతత్వ ప్రకటనలు చేసినందుకు టీఎంసీ ఆయనను విమర్శించిందని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం ఆయననే శాంతి స్థాపకుడిగా మార్చారని విమర్శలు వస్తున్నాయి.
కబీర్, ఎంఐఎంలో చేరాలి...
టీఎంసీపై కోపంగా ఉన్న కబీర్ ను తమ పార్టీలో చేరమని అసదుద్దీన్ ఒవైసీ కోరాడు. పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ వీలైనన్నీ స్థానాల్లో పోటీచేయాలని ఎంఐఎం భావిస్తోంది.
‘‘మేము అభ్యర్థులను నిలబెట్టగల నియోజకవర్గాలను గుర్తించడానికి ప్రస్తుతం సర్వే చేస్తున్నాము’’ అని రాష్ట్ర ఎంఐఎం నాయకుడు మహ్మద్ షేక్ అన్నారు.
రాష్ట్రంలో మతపరమైన విభజన ఏర్పడితే బీజేపీ లాగే ఎంఐఎం కూడా రాజకీయంగా లాభపడే విషయాన్ని ఖండించలేమని సాదుద్దీన్ అన్నారు. అయితే తనకు టీఎంసీ ని వీడే ఉద్దేశం లేదని కబీర్ అన్నారు. బెంగాల్ విషయాల్లో భరత్ పూర్ ఎమ్మెల్యేను పార్టీ ద్రోహిగా పిలుస్తారు.
ఆయన 2011 లో కాంగ్రెస్ శాసనసభ్యుడిగా అసెంబ్లీకి అరంగ్రేటం చేశారు. 2012 లో పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. అక్కడ నుంచి బహిష్కరించబడిన తరువాత స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. 2018 లో బీజేపీలో చేరిన ఆయన, 2021 లో తిరిగి మరోసారి టీఎంసీలో చేరారు.
ప్రస్తుతం కబీర్ పార్టీతో అనేక కలహాలు పెట్టుకున్నారని టీఎంసీ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో తనకు శాంతి స్థాపనపాత్ర ఇవ్వలేదని, తనకు బాధ్యత ఇచ్చి ఉంటే హింస జరిగేదికాదని అన్నారు. హింసకు జంగీపూర్ ఎంపీ, ఎమ్మెల్యేలే కారణమని నిందించారు.
బంగ్లాదేశ్ లాంటి దారుణాలు..
‘‘కబీర్ ఏం చెప్తున్నాడంటే .. దాని పై నేను ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ’’ అని టీఎంసీ సంసర్ గంజ్ ఎమ్మెల్యే అమీరుల్ ఇస్లాం అన్నారు. ముర్షిదాబాద్ జిల్లా యూనిట్ లో చీలిక ఉందని ఆరోపణలు చేశారు. ముర్షిదాబాద్ లో జరిగిన హింస పార్టీకి తీవ్రమైన రాజకీయ చిక్కులను కలిగిస్తుందన్నారు.
పొరుగున ఉన్న మాల్దాలో హిందువులు తన ఇళ్లను వదిలి వెళ్తున్న దృశ్యం బెంగాల్ లోని హిందూవులు, బంగ్లాదేశ్ లోని హిందువులో సమానంగా ఉన్నారనే కథనాన్ని బీజేపీ వ్యాపించే అవకాశం ఉంది.
ముర్షిదాబాద్ లో జరిగిన హింస వలన 400 మంది హిందువులు నిరాశ్రయులయ్యారు. అయితే గత 36 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో వారిలో చాలామంది తిరిగి తమ ఇళ్లకు వస్తున్నారు.
అయినప్పటికీ రాజకీయం కోణం నుంచి చూస్తే మతపరంగా కలిసి ఉండటం నేర్పించకపోతే రాబోయే ఎన్నికల్లో టీఎంసీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ కాగలదు.
Read More
Next Story