‘సుప్రీం’ ను ఆశ్రయించిన బెంగాల్ ప్రభుత్వం.. కారణం ?
సందేశ్ కాళీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు కలకత్త హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వ..
సందేశ్ కాళీలో మహిళలపై జరిగిన లైంగిక అకృత్యాలు, హత్యలు, భూ కబ్జా ఆరోపణపై కలకత్త హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడాన్నిసవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఉన్నత న్యాయస్థానం ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాదన
2024 ఏప్రిల్ 10న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు పోలీసు యంత్రాంగంతో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుత్సాహపరిచిందని బెంగాల్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొంది.
"ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా CBIకి అవసరమైన మద్దతును అందించాలని హైకోర్టు తన ఉత్తర్వులో రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇది సందేశ్ కాళీలో ఉన్న నేరాలను పరిశోధిస్తున్న రాష్ట్ర పోలీసుల అధికారులను లాక్కోవడమే అవుతుంది" అని పిటిషన్ ప్రభుత్వం సుప్రీం ముందుకు తీసుకొచ్చింది. సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులపై జరిగిన దాడి కేసును సిబిఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. జనవరి 5 న జరిగిన సంఘటనలకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ నమోదు చేసింది.
హైకోర్టు ఏం కోరింది?
విచారణను కోర్టు పర్యవేక్షిస్తుందని పేర్కొన్న హైకోర్టు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, క్షేత్ర స్థాయిలో వ్యవసాయభూములను అక్రమంగా లాక్కుని చేపల పెంపకం చేపట్టడంపై సమగ్ర నివేదికను అందించాలంది. ఈనివేదికను మే 2న తమకు సమర్పించాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
రేషన్ బియ్యం పంపిణీ కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పుడు సస్పెండ్ చేయబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ ఇంటిని సోదా చేయడానికి ఈడీ అధికారులు సందేశ్‌ఖాలీకి వెళ్లినప్పుడు ఒక గుంపు అధికారులపై దాడి చేసింది. దీనిపై హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ చేత దర్యాప్తు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దర్యాప్తు నిష్పక్షపాత దర్యాప్తు జరగదని ఈడీ వాదించింది. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
మహిళలపై నేరాలు
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు ప్రార్థించారని పేర్కొన్న హైకోర్టు.. మహిళలపై నేరాలు, భూకబ్జాలకు సంబంధించిన ఆరోపణల తీరును పరిగణనలోకి తీసుకుని సీబీఐతో విచారణకు ఆదేశించాలని నిర్ణయించినట్లు హైకోర్టు పేర్కొంది. షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారితో సహా స్థానికులు ఇక్కడ బాధితులుగా ఉన్నారు.
పిటిషనర్ల తరఫున-లాయర్ ప్రియాంక తిబ్రేవాల్ దాదాపు 600 ఫిర్యాదులను అఫిడవిట్ ల రూపంలో హైకోర్టుకు అందించారు. వీటిలో లైంగిక అఘాయిత్యాలు, భూకబ్జాలు, దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి ఇతర నేరాలు ఉన్నాయి.
Next Story