ఒడిశా షాడో సీఎం భార్యపై వేటు పడింది!
x

ఒడిశా షాడో సీఎం భార్యపై వేటు పడింది!

బీజేపీ అటు ఫిర్యాదు చేసిందో లేదో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అత్యంత సన్నిహితుడైన పాండియన్ సతీమణి, సీనియర్ ఐఎఎస్ అధికారి సుజాత పై వేటు పడింది. ఎందుకంటే..


ఒడిశాలో షాడో ముఖ్యమంత్రి అని ఓ ఐఎఎస్ అధికారి ఉండేవారు గుర్తుందిగా.. ఆయన వీకే పాండియన్. ఆయన భార్య సుజాత ఆర్. కార్తికేయన్. ఈమే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసేవారని పేరుంది. ఆమె భర్త పాండియన్ ఇటీవలే ఐఎఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నవీన్ పట్నాయక్ టీమ్ లో చేరి బీజేడీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. భర్త అడుగుజాడల్లో నడవాలనుకున్నారో ఏమో కాని సుజాత కూడా బీజేడీ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని నవీన్ పట్నాయక్ తో పొత్తులో ఉన్న బీజేపీ భావించింది. ఎక్కడ తేడా వచ్చిందో గాని సరిగ్గా ఎన్నికల సమయంలో ఆమెపై ఒడిశా బీజేపీ రాష్ట్ర శాఖ ఫిర్యాదు చేసింది. ఇక అంతే ఆమెను ఆఘమేఘాల మీద బదిలీ చేసి కేంద్ర ఎన్నికల సంఘం తన 'నిష్పాక్షికత'ను నిరూపించుకుంది.


ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారిణి సుజాత ఆర్‌.కార్తికేయన్‌ను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ ఆమెపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే.. ప్రజా వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్ సన్నిహితుడైన వీకే పాండియన్ సతీమణి సుజాతను బదిలీ చేయడం ప్రస్తుతం ఒడిశాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ బదిలీకి ముందు మిషన్ శక్తి విభాగంలో సుజాత కమిషనర్‌ కమ్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఆమె రాష్ట్రంలో బీజేడీ ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ ఈసీకి చేసిన ఫిర్యాదులో బీజేపీ ఆరోపించింది.
సుజాత భర్త వీకే పాండియన్ గత ఏడాది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి బీజేడీలో చేరారు. 2019 ఎన్నికల ముందు నుంచి పాండియన్‌ సీఎంకు నమ్మకమైన అధికారిగా ఉన్నారు. పాండియన్ నే సూపర్ సీఎం అంటుంటారు. తెర ముందు నవీన్ పట్నాయక్ ఉన్నా తెర వెనక తతంగం నడిపేదంతా పాండియనే అంటుంటారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎక్కడికి వెళ్లినా ఈ పాండియన్ లేనిదే వెళ్లరనే టాక్ కూడా ఉంది. అటువంటి వ్యక్తి భార్యపై ఎన్నికల సంఘం వేటు వేసింది.
Read More
Next Story