
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
బెంగాల్ ఎన్నికలపై బంగ్లాదేశ్ ప్రభావం ఎంత?
మైనారిటీ హిందువులపై జిహాదీ మూకల దాడులు, బెంగాల్ లో నిరసన ప్రదర్శనల్లో బీజేపీ బిజీ బిజీ
ప్రణయ్ శర్మ
బంగ్లాదేశ్ పరిణామాలు వచ్చే ఏడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్న దేశ సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో తీవ్రమైన ప్రభావం చూపనున్నాయి. బంగ్లాదేశ్ లో దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ కొంతమంది ఇస్లామిక్ జిహాదీ గ్రూపులు అక్కడ మైనారిటీ హిందువు అయిన దీపు చంద్రదాస్ ను దారుణంగా కొట్టి చంపారు.
తరువాత అతడి శరీరాన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టుకు ఉరేశారు. ఆ తరువాత కూడా శాంతిచని జిహదీ గ్రూపులు శరీరాన్ని దహనం చేశాయి. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ రాష్ట్రంలో అనేక నిరసనలు నిర్వహించింది.
కొన్ని వారాల క్రితం ఇస్లామిక్ జిహాదీ భావజాలికుడు, భారత వ్యతిరేకి అయిన షరీఫ్ ఉస్మాన్ హదీని ఢాకాలో పట్టపగలు కొంతమంది కాల్చిచంపారు. ఆతరువాత బంగ్లాదేశ్ లో అశాంతి చెలరేగింది. దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించలేదు.
మాజీ ప్రధాని షేక్ హసీనా, భారత్ ఈ దాడికి బాధ్యత వహించాలని అక్కడ ఇస్లామిక్ మూకలు డిమాండ్ చేశాయి. బంగ్లాదేశ్ పోలీసులు హదీని చంపిన వారిని మేఘాలయ పోలీసులకు అప్పగించారని వార్తలు వచ్చాయి.
కానీ భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ అంశం రెండు దేశాల మధ్య ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
భారతంలో చట్టబద్దమైన ఓటర్లుగా లక్షలాది మంది అక్రమ బంగ్లాదేశీయులు ఉండటంతో వారిని గుర్తించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. మమతా బెనర్జీ ప్రభుత్వ మద్దతుతో బంగ్లాదేశీయులు అనేక ఆస్తులను కొనుగోలు చేశారని స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ముస్లింలు..
2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లో 24.6 మిలియన్లకు పైగా ముస్లిం జనాభా ఉంది. ఇది రాష్ట్ర జనాభాలో 27 శాతానికి సమానం. వీరిలో ఎక్కువ మంది జాతీ బెంగాలీలు.
కానీ కొన్ని నివేదికలు బయటి వ్యక్తుల ఉనికి గురించి మాట్లాడుతున్నాయి. రాష్ట్రంలో ముస్లిం జనాభా దాదాపు 30 శాతం ఉంటుందని చెబుతున్నాయి. బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ దారుణ హత్య ఇతర హిందువులపై దాడుల నేపథ్యంలో కోల్ కతలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు, హిందూ మత పెద్దలు భారీ ర్యాలీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనికి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారి నాయకత్వం వహించారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు కొనసాగితే, దేశంలోని విస్తారమైన హిందు జనాభా అలాంటి దాడులను మౌనంగా చూడదని, వాటిని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని సువేందు అధికారి హెచ్చరించారు.
గత దశాబ్ధంలో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ భారీగా ఫుంజుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. పశ్చిమ బెంగాల్ లో వరుసగా నాలుగో సారి అధికారంలోకి రావడానికి టీఎంసీ ప్రయత్నిస్తోంది. కానీ మమతను గద్దె దింపి అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
బంగ్లా ప్రభావం..
ఇటీవల రోజుల్లో బంగ్లాదేశ్ లోని పరిణామాలు మీడియాలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలను ఆధిపత్యం చేస్తున్నాయి. సాంప్రదాయకంగా ఒక బెంగాల్ పరిణామాలు సరిహద్దు ఆవల ఉన్న మరొక బెంగాల్ పై ప్రభావం చూపుతాయి.
గత సంవత్సరం హసీనాను అధికారం నుంచి తొలగించిన విద్యార్థుల నిరసన, పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అధికార పార్టీకి చెందిన గూండాలు ఒక యువ మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసినందుకు యువతపై ప్రభావం చూపింది.
‘‘బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా దీపుదాస్ ను కొట్టి దారుణంగా చంపడం, దహనం చేయడం పశ్చిమ బెంగాల్ ప్రజలను ప్రభావితం చేశాయి. ఎందుకంటే పొరుగు దేశంలో తమ సహ మతస్థులకు ఏమి జరుగుతుందో అని ఇక్కడి హిందువులు ఆందోళన చెందుతున్నారు’’ అని ఉత్తర బెంగాల్ నుంచి రాష్ట్ర శాసనసభలో బీజేపీ సభ్యుడు శంకర్ ఘోష్ అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిలకు ముందు బంగ్లాదేశ్ పరిణామాలు ఒక సమస్యగా మారవచ్చని, ముఖ్యంగా రాబోయే నెలల్లో హిందువులపై ఇలాంటి దాడులు జరిగితే అది ఒక సమస్యగా మారవచ్చని ఘోష్ అంగీకరించారు.
పశ్చిమ బెంగాల్ లో హిందు మెజారిటీని పణంగా పెట్టి ముస్లింలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. బీజేపీ ఇతర పార్టీల ఒత్తిడిలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మారవచ్చని ఆయన భావించారు.
నాలుగోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షలు..
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మే 2011 నుంచి అధికారంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తన ప్రభావాన్ని క్రమంగా పెంచుకుంటోంది.
రాబోయే స్థానాల్లో టీఎంసీ స్థానాన్ని భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. ప్రస్తుత అసెంబ్లీలో 294 సీట్లలో మమతా పార్టీ 215 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 77 సీట్లు ఉన్నాయి.
ఓట్ల వాటా శాతంపరంగా రెండు పార్టీల మధ్య పదిశాతం తేడా ఉంది. 2011 లో 34 సంవత్సరాల వామపక్షాల పాలనకు మమతా బెనర్జీ రెడ్ కార్డ్ వేశారు. తరువాత ముస్లింలు మమతా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరో వైపు బీజేపీ హిందూ ఓట్లను ఏకీకరణ చేయడానికి ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో హిందూ ఓటర్లలో ఎక్కువ మంది ఇప్పటి వరకూ తమ విశ్వాసాన్ని మార్చుకుని బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అయితే పశ్చిమ బెంగాల్ లోని మమతకు వ్యతిరేకంగా ఓటర్లలోని కొన్ని వర్గాలలో ప్రబలనమైన అవినీతి ఆరోపణలు ఉండటంతో పాటు ముస్లింలు బుజ్జగించడం, రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం రెండు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు పశ్చిమ బెంగాల్ లోని ముస్లింల పట్ల మమత బెనర్జీ చూపే మృదువైన వైఖరికి సంబంధం ఉందా అనేది ఇప్పటికే చర్చలకు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ప్రస్తుతానికి ఆందోళన కలిగించకపోవచ్చు. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించిన తరువాత అవి కొనసాగితే సమస్యగా మారవచ్చని మమతకు సన్నిహిత వర్గాలు సూచించాయి.
కానీ మరికొందరు మమతను ఓడించడంలో రాష్ట్ర బీజేపీ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు పార్టీ ఎంత ప్రచారం చేసినప్పటికీ, ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల ఎంపికతో ఇది ఎప్పుడు సరిపోలడం లేదని వారు వాదిస్తున్నారు.
‘‘మమతా బెనర్జీ ఇప్పటికి బీజేపీ కంటే 10 శాతం ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగించగలుగుతున్నారు. ఇది తరువాత వారికి అంత తేలికైన విషయం కాదు’’ అని కోల్ కత కు చెందిన రాజకీయ వ్యాఖ్యత నిర్మాల్య ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
మమతకు వ్యతిరేకంగా అట్టడుగు స్థాయి నుంచి ఉద్యమం జరగకపోతే పశ్చిమ బెంగాల్ లో ఓటర్లపై ఆమె టీఎంసీకి ఉన్న పట్టును విచ్చిన్నం చేయడం కష్టమని ఆయన అన్నారు.
మమతకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో నిజంగా ఏదైన ఉద్యమం జరుగుతుందా లేదా అనేది రాబోయే నెలలు చూడాలి. అది ఆమె నాలుగోసారి విజయం సాధించాలనే ప్రణాళికలను దెబ్బతీస్తుంది.
Next Story

