డబ్బులు లేవన్న సుచరిత స్థానంలో కొత్త అభ్యర్థికి ఛాన్స్
x

డబ్బులు లేవన్న సుచరిత స్థానంలో కొత్త అభ్యర్థికి ఛాన్స్

పూరీ ఎంపిగా పోటీ చేయడానికి బీ ఫాం ఇచ్చినప్పటికీ ప్రచారానికి నిధులు అందించలేదన్న కారణంగా టికెట్ వెనక్కి ఇచ్చిన సుచరిత స్థానంలో కొత్త అభ్యర్థిని కాంగ్రెస్..


ఒడిషాలోని పూరి లోక్ సభ స్థానానికి కొత్త అభ్యర్థిగా జయ నారాయణ్ పట్నాయక్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఇంతకుముందు ఇదే స్థానానికి కాంగ్రెస్, సుచరిత మొహంతికి బీ ఫాం అందజేసింది. అయితే తనకు పార్టీ ఫండ్స్ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆమె పోటీ నుంచి తప్పుకుంది. కాంగ్రెస్ ఎంపీ బ్రజ్ మోహన్ కుమార్తె అయిన సుచరిత, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు పంపిన ఈ మెయిల్ లో.. పార్టీ తనకు నిధులు నిరాకరించినందున తన ప్రచారం ముందుకు సాగట్లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జీ అజోయ్ కుమార్ అడిగితే తన సొంత వనరులతో ప్రచారం చేసుకోవాలని చెప్పినట్లు ఆమె ఆరోపించారు.

‘‘ నేను 10 సంవత్సరాల క్రితం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాను. వృత్తిరీత్యా నేను జర్నలిస్ట్ ను. పూరీలో నేను ప్రచారానికి నాకు ఉన్నదంతా ఇచ్చాను. ప్రగతిశీల రాజకీయాల కోసం నా ప్రచారానికి మద్ధతు ఇవ్వాలని పబ్లిక్ ఫండ్స్ కోసం ప్రయత్నించాను. నేను కూడా నా వంతు ప్రయత్నం చేశా. అయితే అంచన వేసిన మొత్తాన్నిసేకరించలేకపోయాను’’ అని సుచరిత అన్నారు.
పార్టీ నిధుల కోసం సీనియర్ నేతలందరిని సంప్రదించానని మొహంతి చెప్పారు. పూరి సీటు దక్కించుకోవడానికి ప్రచారం చేయాలని, కానీ నా దగ్గర అంతమొత్తం లేదు. కావునా నేను పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నాను. అందుకే నేనే పార్టీ టికెట్ తిరిగి ఇచ్చేశాను అని మెయిల్ లో చెప్పినట్లు వివరించారు. తాను నమ్మకమైన కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటానని చెప్పారు. పూరి లోక్ సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందని సుచరిత ఆరోపించారు. ‘‘ బీజేపీ, బీజేడీ రెండు డబ్బు పర్వతాలపై కూర్చున్నాయి. డబ్బు ప్రభావం అంతటా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వారితో పోరాడటం కష్టమైంది’’ అనిఅన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మొహంతి స్థానంలో పట్నాయక్ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించినట్లు వెల్లడించారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకుడు ఒకరు స్పందిస్తూ.. ప్రచారం తారాస్థాయికి తీసుకెళ్లినప్పుడు అభ్యర్థులకు డబ్బులు ఇవ్వబడతాయని అన్నారు. ఇక్కడ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రను రంగంలోకి దింపగా, బీజేడీ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ ను బరిలోకి దింపింది. మే 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది.


Read More
Next Story