బిహార్: ‘నీట్’ లీక్ లో రాజకీయ నాయకుడి పేరు..
x

బిహార్: ‘నీట్’ లీక్ లో రాజకీయ నాయకుడి పేరు..

నీట్ పేపర్ లీక్ లో అనూహ్యంగా మాజీ డిప్యూటీ సీఎం పేరు తెరపైకి వచ్చింది. పేపర్ లీక్ చేసిన నిందితులకు మాజీ డిప్యూటీకి సహాయకుడిగా పని చేస్తున్న వ్యక్తికి బంధుత్వం..


బిహార్ లో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు వస్తున్న ఆరోపణలు అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకున్నాయి. కుంభకోణాలకు మారుపేరైనా లాలూ కుటుంబ వారసుడు తేజస్వీ యాదవ్ పేరు ఇందులో తాజాగా తెరపైకి వచ్చింది.

NEET-UG 2024 పరీక్షా పత్రాల లీక్‌కు సంబంధించి నలుగురు వ్యక్తులను బిహార్ పోలీసులు అరెస్టు చేశారు. వారు నీట్ లొ సీట్ ఆశించిన అనురాగ్ యాదవ్, అతని మేనమామ, సికందర్ ప్రసాద్ యాదవ్, మరో ఇద్దరు నిందితులు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ ఉన్నారు. నిందితుల్లో ఒకరైన యాదవేందు తన మేనల్లుడి కోసం ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతను నితీష్, అమిత్ ల నుంచి ప్రశ్నా పత్రాలు కొన్నట్లు అలాగే వాటిని మరో ముగ్గురు అభ్యర్థులకు ఇచ్చానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
తేజస్వితో నిందితుడికి లింకేంటి?
గురువారం (జూన్ 20), బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, తేజస్వి సహాయకుడు ప్రీతమ్ యాదవ్‌కు సికందర్ బంధువు కాబట్టి ఈ మొత్తం స్కామ్‌లో తేజస్వి పాత్ర ఉందని ఆరోపించారు.
పరీక్షకు రోజుల ముందు ప్రీతమ్ తన సోదరి, ఆమె కుమారుడు అనురాగ్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గెస్ట్‌హౌస్‌లో సికందర్ కోసం ఒక గదిని కూడా బుక్ చేసారని ఉపముఖ్యమంత్రి చెప్పాడు. ఈ కేసులో తేజస్వి ప్రమేయాన్ని సూచిస్తూ డైరీలో ‘మంత్రి’ పేరు కూడా ఉందని ఆయన అన్నారు.
“సికందర్ యాదవ్ తేజస్వి యాదవ్ పీఏ ప్రీతమ్ కుమార్‌కి దగ్గరి బంధువు. మే 4న సికందర్ సోదరి రీనా, ఆమె కుమారుడు అనురాగ్ కోసం NHAI గెస్ట్‌హౌస్ బుక్ చేయబడింది. డైరీలో ఫోన్ నంబర్, ఒక మంత్రి పేరు ప్రస్తావించబడింది…” అని డిప్యూటీ సీఎం చెప్పారు.
“ప్రీతమ్ కుమార్ ఇప్పటికీ తన వ్యక్తిగత కార్యదర్శి కాదా అని తేజస్వి యాదవ్ స్పష్టం చేయాలి. సికిందర్ కుమార్ యాదవ్ ఎవరో కూడా అతను స్పష్టం చేయాలి. లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జైలుకెళ్లినప్పుడు సికిందర్ కుమార్ యాదవ్ లాలూ సేవలో ఉండేవాడు.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్..వీరు ప్రజల భవిష్యత్ తో ఆడుకుంటారు. వారు అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ లు చేస్తారు. నియామక ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు..’’ అని ఆయన నిప్పులు చెరిగారు.
ఉన్నత స్థాయి విచారణ చేయాలి
నీట్ పరీక్షకు నాలుగు రోజుల ముందు మే 1న గెస్ట్ హౌస్‌లో సికందర్ కోసం గదిని బుక్ చేయడానికి బీహార్ రోడ్డు నిర్మాణ విభాగానికి చెందిన ఉద్యోగిని ప్రీతమ్ పిలిచాడని సిన్హా చెప్పారు. తన మేనల్లుడు అనురాగ్, అతని తల్లి, ఇతర సహచరులను పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాలో ఉండాలని సిఫారసు చేసినట్లు సికందర్ అనే ఇంజనీర్ చెప్పాడు.
కమ్యూనికేషన్‌ను ధృవీకరించడానికి ప్రీతమ్ ప్రదీప్ మధ్య కాల్ రికార్డులు ఉన్నాయని పేర్కొన్న సిన్హా, ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ప్రదీప్‌తో సహా రోడ్డు నిర్మాణ విభాగంలోని ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయితే, బీహార్ NHAI ఒక ప్రకటనలో, నిందితులు తమ గెస్ట్‌హౌస్‌లో ఉండలేదని పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ లేదని వెల్లడించింది.
నిందితుల ఒప్పుకోలు
నీట్ ప్రశ్నపత్రాలను నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ తనకు ₹32 లక్షలకు విక్రయించారని సికందర్ ఒప్పుకున్నాడు. నీట్, యుపిఎస్‌సి సహా పరీక్షా పత్రాలను లీక్ చేయడంలో 'స్పెషలిస్ట్‌లు' అని చెప్పుకునే రాకెట్‌లో వారు భాగమని ఆయన చెప్పారు.
తన మేనల్లుడు కాకుండా మరో ముగ్గురు అభ్యర్థులు ఆయుష్ రాజ్, శివానందన్ కుమార్, అభిషేక్ కుమార్‌లకు లాజిస్టికల్ సాయం అందించినట్లు సికందర్ అంగీకరించాడు. పరీక్ష హాల్‌లలో వచ్చిన ప్రశ్నలు తనకు ఇచ్చిన లీకైన ప్రశ్నపత్రంతో సరిపోలుతున్నాయని అనురాగ్ ధృవీకరించారు. ఇతర ఆశావహులు కూడా అదే విషయం చెప్పారు.
తాను, మిగతా ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు ఒకరోజు ముందు తన మామ నుంచి ప్రశ్నపత్రాన్ని అందుకున్నారని, సమాధానాలను కంఠస్థం చేశాఅని అనురాగ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షల్లో పేపర్ లీక్ జరిగాయన్న ఆరోపణల మధ్య ఈ నేరాంగీకారాలు అరెస్టులు వెలుగులోకి వచ్చాయి. అయితే పేపర్ లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణలను నీట్, కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చాయి.
Read More
Next Story