46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథ 'రత్న భాండార్' తలుపులు
ఒడిశా రాష్ట్రం పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్ తలుపులను ఆదివారం తెరవబోతున్నాయి. ఇందులో విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు సమాచారం.
ఒడిశా రాష్ట్రం పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్ తలుపులను ఆదివారం తెరవబోతున్నాయి. ఇందులో విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన నెలరోజులలో రత్న భాండాగారాన్ని తెరిపిస్తామని హామీ బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రత్న భండార్ గది తలుపులను చివరిసారిగా 1978లో తెరిచారు. ప్రస్తుతం 46 ఏళ్ల తర్వాత మరోసారి తెరవబోతున్నారు.
సుముహూర్తంలోనే..
రత్న భాండార్ గది తలుపులను తెరిచేందుకు సుముహూర్తం ఫిక్స్ చేస్తారు. జిల్లా అధికార యంత్రాంగం వద్ద ఉన్న డూప్లికేట్ కీతో ద్వారాన్ని తెరవనున్నారు. ఆ తాళం చెవి పనిచేయకపోతే.. మేజిస్ట్రేట్ సమక్షంలో తాళం పగలగొడతామని మంత్రి హరిచందన్ తెలిపారు.
‘రత్న భండార్‌ను సందర్శనకు నిపుణుల బృందం’
‘‘రత్న భాండాగారం ద్వారాన్ని తెరిచే బాధ్యతను హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రాథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి అప్పగించాం. ఈ ప్యానెల్‌లో ఎఎస్‌ఐ, సర్విటర్స్, మేనేజింగ్ కమిటీ, హైపవర్ కమిటీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఆభరణాలను మొదట ఫోటోలు తీసి డిజిటల్ కేటలాగ్ తయారుచేస్తారు. ఆభరణాల జాబితా తయారీలో పారదర్శకత కోసం ఆర్‌బిఐ సాయం తీసుకున్నాం. ఆర్‌బిఐ ప్రతినిధులు ఇన్వెంటరీ సమయంలో అక్కడే ఉంటారు. పోయినసారి ఇన్వెంటరీ ప్రక్రియ పూర్తి చేయడానికి 70 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఈసారి సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం" అని న్యాయశాఖ మంత్రి హరిచందన్ వివరించారు.
సిద్ధంగా వైద్య బృందం..
రత్న భాండాగారంలో పాములు ఉండే అవకాశం ఉండడంతో వాటిని పట్టేవాళ్లను (స్నేక్ క్యాచర్స్)ను సిద్ధంగా ఉంటారు. లోపలికి వెళ్లిన వారు అనుకోకుండా పాము కాటు బారినపడితే, వారికి తక్షణం చికిత్స అందించేందుకు వీలుగా వైద్య బృందాన్ని సిద్ధం చేశారు.