‘లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం’ వేధించేందుకు స్వేచ్ఛనిచ్చిందా?
x

‘లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం’ వేధించేందుకు స్వేచ్ఛనిచ్చిందా?

'లవ్ జిహాద్' - ముస్లిం పురుషుడు, హిందూ స్త్రీ కలయికను చెప్పడానికి వాడే పదం. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం కింద గుజరాత్ లో నమోదయిన కేసులెన్ని? ముస్లింల స్పందనేంటి?


గుజరాత్ పోలీసులు గడిచిన 45 రోజుల్లో ఆరు 'లవ్ జిహాద్' కేసులను పరిష్కరించారు. "బలవంతపు మతమార్పిడులకు పాల్పడే వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు తెచ్చిన 'యాంటీ లవ్ జిహాద్ చట్టం' కింద నిందితులను అరెస్టు చేశారు.

'లవ్ జిహాద్' అనేది ముస్లిం పురుషుడు, హిందూ స్త్రీ కలయికను చెప్పడానికి వాడే పదం. ముస్లిం పురుషులు హిందూ స్త్రీలను 'ట్రాప్' చేసి వారిని పెళ్లికి ఒప్పిస్తున్నారని మితవాదులు ఆరోపిస్తున్నారు.

గుజరాత్ హోం మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో .. లజ్ జిహాద్ కింద నమోదయిన ఆరు కేసుల్లో .. నాలుగు వెస్ట్ కుచ్ ప్రాంతంలోని భుజ్, మాండ్వి, నఖత్రానా, మాదాపూర్‌లో చోటుచేసుకున్నవని పేర్కొన్నారు.

“కిడ్నాప్, అత్యాచారం ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు దర్యాప్తు చేయడానికి కొన్ని టీంలను ఏర్పాటు చేస్తారు. ఈ టీంలు మానవ వనరులను, సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. యూనిఫాంలో కాకుండా సాధారణ దుస్తులు లేదంటే మారువేషంలో వెళ్లి అనుమానం రాకుండా దర్యాప్తు కొనసాగిస్తాయి. ఈ తరహాలోనే ఒక నిందితుడిని బీహార్‌ నుంచి, మరొకరిని రాజస్థాన్‌ నుంచి అరెస్టు చేశారు. బాధిత మహిళలను కాపాడి వాడి కుటుంబసభ్యులకు అప్పగించారు.’’ అని వెస్ట్ కుచ్ జోన్‌ పోలీసు అధికారి చెప్పారు.

మొత్తం ఆరింటిలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడం గమనార్హం. మిగిలిన నాలుగు కేసులు లవ్ జిహాద్ వ్యతిరేకంగా పోరాడుతున్న మితవాద సంస్థలు ఫిర్యాదు చేశాయి.

మాండ్వి పోలీస్ స్టేషన్‌లో మే 19న రజక్ సిద్ధిక్ సుమ్రాపై, అలాగే మే 31న అబుభాకర్ రామ్‌జు సుమ్రాపై భుజ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. బాధితురాళ్ల తండ్రుల ఫిర్యాదు మేరకు నమోదయిన ఈ కేసుల్లో బాధితులను పోలీసులు ‘‘లవ్ జిహాద్" లుగా పేర్కొన్నారు. హిందూ మహిళలను ప్రలోభపెట్టి అత్యాచారానికి, మత మార్పిడికి పాల్పడడం ద్వారా లవ్ జిహాద్‌గా మార్చారని తెలుస్తోంది.

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉస్మాన్ ఘనీ సులేమాన్ అబ్దాపై, జూన్ 23న భుజ్‌లో సలీం అబ్దుల్ జునేజాపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇవి భుజ్ తాలూకాలోని స్థానిక మితవాద సంస్థ సభ్యుల ఫిర్యాదు మేరకు నమోదు చేసినవి.

కూరగాయల విక్రేతలుగా పోలీసులు..

సలీం అబ్దుల్ జునేజాపై నమోదైన కేసులో పోలీసులు మారువేషంలో వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. బాధిత మహిళను నిందితులు బీహార్‌లోని చంపారన్ జిల్లాకు తీసుకెళ్లారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పోలీసులు స్థానిక అధికారుల సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. వెస్ట్ కచ్ పోలీసులు వీధి వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారిలా వేషంలో నిఘా ఉంచి సలీంను పట్టుకున్నారు.

మరో కేసులో వేటగాళ్ల వేషంలో..

ఉస్మాన్ అబ్ధా అనే యువకుడు ఒక హిందూ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఉస్మాన్‌ను పట్టుకునేందుకు పోలీసులు రాజస్థాన్ అడవుల్లో వేటగాళ్ల వేషంలో ఐదు రోజులపాటు ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం బాధితురాలిని సురక్షితంగా కాపాడి నిందితులను అరెస్టు చేశారు.

ముస్లింలను వేధిస్తున్నారు..

నిందితులలో ఒకరి తల్లిదండ్రులు ఫెడరల్‌తో మాట్లాడుతూ.. “పోలీసులు మా కొడుకుతో కలవనివ్వడంలేదు. మా అబ్బాయి తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని మాకు చెప్పారు. మేం విద్యావంతులం. చట్టం గురించి తెలిసిన వాళ్లం. మాకు తెలిసిన అమ్మాయి, మా అబ్బాయి మూడేళ్లుగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గత నెలలో వారి పెళ్లికి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మా ప్రాంతానికి చెందిన కొంతమంది పురుషుల జోక్యంతో అబ్బాయి, అమ్మాయి రాష్ట్రం నుండి ఎక్కడికి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు. ఆమె భద్రత గురించి మాకు ఆందోళనగా ఉంది. ’’ అని చెప్పారు.

ఆ హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది..

గుజరాత్‌కు చెందిన మైనారిటీ హక్కుల సంస్థ, మైనారిటీ మైనారిటీ కోఆర్డినేట్ కమిటీ కన్వీనర్ ముజాహీద్ నఫీస్ ది ఫెడరల్‌తో ఇలా అన్నారు. " హిందూ మహిళలను రక్షించే ముసుగులో ముస్లిం పురుషులను హింసించడానికి చట్టం తీసుకొచ్చారు. వాస్తవానికి తన భాగస్వామిని ఎంచుకునే స్త్రీకి ఉన్న ప్రాథమిక హక్కు.’’ అని చెప్పారు.

నఫీస్ ప్రకారం.. ‘‘మొదట తప్పిపోయిన, కనపడకుండ పోయిన వ్యక్తి గురించి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారు అనుమానితులను విచారిస్తారు. కాని సవరించిన చట్టం ప్రకారం.. బలవంతంగా మత మార్పిడి చేశారంటూ తప్పిపోయిన మహిళ గురించి ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అలా జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా అపహరణకు గురైన మనిషిపైనే ఉంటుంది.’’ అన్నారు.

మొదటి అరెస్టు..

బడ్జెట్ సెషన్‌లో బిల్లును ఆమోదించి, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా ఆమోద ముద్ర వేశాక గుజరాత్ మత స్వేచ్ఛ (సవరించబడిన) చట్టం - 2021, జూన్ 15, 2021న అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గుజరాత్ పోలీసులు జూన్ 19 న ఈ చట్టం కింద ఒక సమీర్ ఖురేషీపై తొలి కేసు నమోదు చేశారు. వడోదరలోని తర్సాలి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నాన్-బెయిలబుల్ చట్టం కింద ఆరుగురిని అరెస్టు చేశారు. దాదాపు ఏడాది తర్వాత నవంబర్ 2022లో గుజరాత్ హైకోర్టు జస్టిస్ నిరల్ మెహతా సింగిల్ బెంచ్ ధర్మాసనం దాన్ని రద్దు చేసింది.

జూన్ 19న 24 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు ఒకరిని అరెస్టు చేశారు. తన అసలు మతాన్ని దాచిపెట్టి క్రిస్టియన్‌గా నటించి తనను పెళ్లి చేసుకున్నాడని సదరు మహిళ ఫిర్యాదు చేసింది.

'సామరస్య పరిష్కారం'..

ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తున్నప్పుడు ఇద్దరి జీవితాలకు ముడిపడి ఉండడంతో..ఈ తరహా కేసులను ఫిర్యాదుదారు, నిందితులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచిస్తుంది.

ఒక కేసులో సమీర్ భార్య, 'బాధితురాలు' దివ్యాబెన్ కోర్టు ముందు ఒక దరఖాస్తును సమర్పించారు. “లవ్ జిహాద్ కోణాన్ని పోలీసులే స్వయంగా తీసుకువచ్చారు. ఈ ఆరోపణలు సరికాదు. నేనెప్పుడూ అలాంటి ఆరోపణలు చేయలేదు. నన్ను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని నేను ఎప్పుడూ అనలేదు’ అని తన పిటీషన్‌లో పేర్కొంది.

వాస్తవానికి 2008లో చట్టం అమలు..

గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం 2008లో అమల్లోకి వచ్చింది. ఒక వ్యక్తి మత మార్పిడి కోసం జిల్లా అధికార యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి పొందడాన్ని తప్పనిసరి చేసింది. ఈ చట్టం ప్రకారం బలవంతంగా మతమార్పిడికి పాల్పడినట్లు రుజువైతే రూ. 50వేల వరకు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

అయితే 2021లో ఈ చట్టానికి సవరణ చేశారు. నేరాన్ని నాన్‌బెయిలబుల్‌ సెక్షన్‌గా మార్చారు. ప్రేమ, పెళ్లి పేరుతో మతమార్పిడికి సహకరించే వారిని కూడా దోషులుగా పరిగణిస్తామని సవరించిన చట్టం పేర్కొంది. ఒక మహిళ 'బాధితురాలు'గా భావించినపుడు.. ఆమెతో ఏ సంబంధం లేని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చట్టం చెబుతోంది.

ఇప్పటికే చట్టాలున్నాయి...

‘‘2014 తర్వాత మితవాద సంస్థలు లవ్ జిహాద్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి చట్టాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. ప్రస్తుత సవరణ అదే ఎజెండాకు పొడిగింపు. గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం కింద నేరంగా వర్గీకరించబడిన చర్యలు ఇప్పటికే భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల ప్రకారం నేరపూరితమైన చర్యలు. ”అని న్యాయవాది సంషాద్ పఠాన్ ది ఫెడరల్‌తో అన్నారు.

ఇంకా ఇలా అన్నారు.. “ఉదాహరణకు ఒక పురుషుడు స్త్రీకి అబద్ధం చెప్పి తన గుర్తింపును దాచినట్లయితే అది IPC సెక్షన్ 406 లేదా 420 ప్రకారం 7 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇది గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం కింద విధించే శిక్ష కంటే ఎక్కువ. ఒక పురుషుడు స్త్రీని రేప్ చేసినా లేదా వేధించినా.. అది IPC సెక్షన్ 376 ప్రకారం శిక్షార్హం. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుంటే తప్ప కొత్త చట్టం అవసరం లేదు.’’ అని చెప్పారు.

Read More
Next Story