Delhi Polls | మిత్రపక్షాలతో ఫుల్‌జోష్‌లో ఉన్న బీజేపీ
NDA మిత్రపక్షాల పాత్ర కేవలం ఎన్నికలలో విజయం సాధించడానికి మాత్రమే కాకుండా..కూటమి ఐక్యతను చూపేందుకు దోహదపడుతుందని BJP భావిస్తోంది.
ఢిల్లీలో ఎన్నికల పోరు చూస్తుంటే.. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాల’న్న సామెత బీజేపీ(BJP)కి బాగా సూటవుతుంది. దేశాన్ని పాలించే పార్టీ.. ఉన్న చోట(ఢిల్లీ) మాత్రం గెలువలేకపోవడం కమలనాథులను చాలాఏళ్లుగా బాధిస్తోంది. ఎలాగైనా గెలవాలన్న కసి వారిలో ఈ సారి బాగానే కనిపిస్తుంది. వరుసగా మూడోసారి చీపురు (ఆప్) పార్టీ అధికారంలోకి రాకుండా ఎత్తులు బాగానే వేస్తున్నారు. తమతో సత్సంబంధాలున్న పార్టీల అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. దీనివల్ల వాళ్లకు రెండు ప్రయోజనాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడం ఒకటయితే..ఊహించని విధంగా ఫ్రెండ్లీ పార్టీ క్యాండెట్లే గెలిస్తే మాత్రం..అధికారం బీజేపీ వశమైనట్టే.
NDA మిత్రపక్షాల పాత్ర కేవలం ఎన్నికలలో విజయం సాధించడానికి మాత్రమే కాకుండా..కూటమి ఐక్యతను ప్రజలకు చూపేందుకు దోహదపడుతుందని BJP భావిస్తోంది.
బరిలో ఇతర పార్టీలు సైతం..
JD(U): బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఈ పార్టీ ఇప్పటికే బురారీ, సంగమ్ విహార్ స్థానాలలో పోటీకి ఆసక్తి చూపుతోంది.
LJP (రామ్ విలాస్): చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఈ పార్టీ.. బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉంది.
RLD: జయంత్ సింగ్ నాయకత్వంలోని ఈ పార్టీ.. కేవలం ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే కాకుండా ఈ సారి ఢిల్లీలోనూ తమ అభ్యర్థులను బరిలో దించాలని ఉవిల్లూరుతుంది.
అంతా ఓకే అయితే..బురారీ, సంగమ్ విహార్‌లో JD(U), సెమాపురిలో LJP అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
కీలకం కానున్న పూర్వాంచల్ ప్రాంతవాసుల ఓట్లు..
ఢిల్లీ మొత్తం జనాభాలో పూర్వాంచల్ ప్రాంత (ఉత్తరప్రదేశ్, బీహార్) వాసులు ఒక భాగం. వీరంతా ఎక్కువగా ముఖ్యంగా పటియాలా హౌస్ కోర్టు, బురారీ, సంగమ్ విహార్ వంటి ప్రాంతాలలో నివసిస్తున్నారు. కనీసం 20 స్థానాల్లో వీరి ఓట్లు కీలకం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే AAP బలంగా ఉంది. 2015, 2020 ఎన్నికలలో ఇక్కడి నుంచి AAP అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఈ సారి BJP వ్యూహాత్మకంగా పావులు కదిపింది. యూపీ, బీహార్‌లో ప్రధాన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చి.. అంతిమంగా అధికారంలోకి రావాలన్నది కమలనాథుల స్కెచ్. రాజకీయ విశ్లేషకులు సంజయ్ కుమార్ ప్రకారం.. పూర్వాంచల్ ప్రాంతవాసుల ఏరియాల్లో AAP బలంగానే ఉన్నా.. NDA కూటమిలోకి మిత్రపక్షాలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ ప్రచారానికి బలం చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
SC రిజర్వ్ స్థానాల్లో బలహీనం..
ఇకపోతే ఢిల్లీలోని 12 SC రిజర్వ్ నియోజకవర్గాల్లో BJP గత రెండు ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలో LJPకి, SC కమ్యూనిటీతో ఉన్న సత్సంబంధాలను BJP క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. సెమాపురి నియోజకవర్గంలో ఈ పార్టీ తరచూ పోటీ చేస్తుంది. ఇక JD(U) కూడా SC కమ్యూనిటీ మీద ప్రభావం చూపేగా పార్టీగా చెప్పుకోవాలి.
మిత్రపక్షాల సపోర్టుతో NDA కాస్త హుషారుగానే ఉందని చెప్పాలి. అయితే ఫిబ్రవరి 5 జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది.