‘నిజాయితీ లేని వ్యక్తుల్లో రాహుల్ ఒకరు’
x

‘నిజాయితీ లేని వ్యక్తుల్లో రాహుల్ ఒకరు’

"కేజ్రీవాల్‌కు ధైర్యం ఉంటే ఇండియా కూటమిని వీడాలి’’ - కాంగ్రెస్ నేత అల్కా లాంబా


ఢిల్లీ పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శనివారం (జనవరి 25) కాంగ్రెస్‌పై తన ప్రచార దాడిని మరింత తీవ్రం చేసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా "నిజాయితీ లేని వ్యక్తులు" అని విమర్శించింది.

రాహుల్ గాంధీ ఆప్‌పై వరుస దాడుల తర్వాత.. ఆప్ నుంచి వచ్చిన మొదటి గట్టి ప్రతిస్పందన ఇదే. ఇప్పటివరకు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్(Arvind Kejriwal) పబ్లిక్‌గా రాహుల్‌ను ప్రత్యక్షంగా విమర్శించలేదు.

"కేజ్రీవాల్ నిజాయితీ అసత్యవాదులను మించి నిలుస్తుంది" ట్యాగ్‌లైన్‌తో ఉన్న పోస్టర్లో ప్రధాని మోదీ(PM Modi), హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ బీజేపీ నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయి. వీరితో పాటు కేజ్రీవాల్‌ను "జాతీయ వ్యతిరేకి"గా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకన్, కేజ్రీవాల్‌తో పోటీపడుతున్న షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కూడా ఉన్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(Sheila Dikshit) విజయాలకు కేజ్రీవాల్ సరితూగడని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన అనంతరం ఈ పోస్టర్ విడుదలైంది.

రాహుల్ vs కేజ్రీవాల్

"ఢిల్లీ ఇప్పుడు షీలా దీక్షిత్ మోడల్‌ను కోరుకుంటోంది. నరేంద్ర మోదీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి తప్పుడు ప్రచారాన్ని, పీఆర్ మోడల్‌ను కాదు," అని రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో అన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం, అవినీతికి సమాధానం ఇవ్వడంలో ఆప్ నేతలు విఫలమయ్యారని అన్నారు. మరో సందర్భంగా మోదీ, కేజ్రీవాల్ ఇద్దరూ దళితులు, గిరిజనుల హక్కులకు అడ్డుకోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ కౌంటర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి పోటీగా కాలకాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత అల్కా లాంబా అరవింద్ కేజ్రీవాల్‌కు ఛాలెంజ్ విసిరారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తో పొత్తు కోసం "బతిమాలింది" కేజ్రీవాలేనని ఆరోపించారు.

"కేజ్రీవాల్‌కు ధైర్యం ఉంటే ఇండియా కూటమిని విడిచిపెడతానని ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలతో బలంగా ఉంది. కేజ్రీవాలే బీజేపీకి 7 స్థానాలను అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మీరు (కేజ్రీవాల్) మా పొత్తు కోసం బతిమాలారు. ఢిల్లీలో 7 స్థానాల కోసం మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగింది," అని వార్తా సంస్థ ANIతో అన్నారు అల్కా లాంబా.

Read More
Next Story