‘ఢిల్లీ ఘటన గ్యాంగ్ రేప్ కాదు’
x

నిందితుడు సంజయ్ రాయ్

‘ఢిల్లీ ఘటన గ్యాంగ్ రేప్ కాదు’

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారానికి ఒడిగట్టింది ఒక్కడేనా? లేక ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది.


కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారానికి ఒడిగట్టింది ఒక్కడేనా? లేక ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆగస్టు 9న జరిగిన అత్యాచారం, హత్య కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)..ఆమెపై సామూహిక అత్యాచారం ఆరోపణలను తోసిపుచ్చింది. సంజయ్ రాయ్ మాత్రమే నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. తమ దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు చెప్పారు.

సీబీఐపై ఒత్తిడి..

మమతా బెనర్జీ కేసుకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని సీబీఐని డిమాండ్ చేశారు. “నేను ఐదు రోజుల సమయం అడిగాను. కాని కేసును సీబీఐకి అప్పగించారు. వారికి న్యాయం అక్కర్లేదు. ఆలస్యం కోరుకుంటున్నారు. 16 రోజులైంది. న్యాయం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. సీఎంతో పాటు ప్రతిపక్షాలు, ప్రజల నుంచి కూడా సీబీఐ తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొంది.

తుది నివేదిక కోసం బాధితురాలి మెడికల్ రిపోర్టుతో పాటు నిందితుడి DNA రిపోర్టును ఢిల్లీలోని AIIMS (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కి పంపామని కేంద్రం దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసులో సీబీఐ 100 కంటే ఎక్కువ వాంగ్మూలాలను నమోదు చేసింది. హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో సహా 10 మందికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను బట్టి మహిళా వైద్యురాలిపై సంజయ్ రాయ్ మాత్రమే అత్యాచారం చేశారని ఏజెన్సీ ఒక అభిప్రాయానికి వచ్చింది.

ముగ్గురి అరెస్టు ..

సందీప్ ఘోష్ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసింది. ఆర్‌జి కర్ హాస్పిటల్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. అక్తర్ అలీ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. ఘోష్ అనాథ శవాలను విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాలను రవాణా చేయడం, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు అలీ ఆరోపించారు. ఘోష్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు స్టేట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా అతనిని సస్పెన్షన్ విధించింది.

Read More
Next Story