
యమునా జలాల శుద్ధీకరణకు యాక్షన్ ప్లాన్..
యమునా నది శుభ్రపరచడం, కొత్త జైలు, బస్సు ఛార్జింగ్ పాయింట్లకు నిధులు మంజూరు చేసిన ఢిల్లీ రేఖా గుప్తా ప్రభుత్వం
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన ఏర్పాటయిన వ్యయ ఆర్థిక కమిటీ (Expenditure Finance Committee) తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. యమునా నీటి శుద్ధీ కరణ, నరేలాలో జైలు నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధుల విడుదలకు EFC ఆమోదించిందని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘యమునా నీటి శుద్ధీకరణకు 27 STP (sewage treatment plants) ప్లాంట నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణానికి రూ.3,140 కోట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.4వేల కోట్ల ఇచ్చేందుకు EFC ఆమోదించింది.
రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఢిల్లీ ద్వారకలోని DTC క్లస్టర్ డిపో-I & II, ISBT సెక్టార్-22, DTC డిపో సెక్టార్-8 వద్ద ఎలక్ట్రిక్ బస్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.107.02 కోట్లు కేటాయించారు.
నరేలాలో 256 మంది ఖైదీల ఉండేందుకు వీలుగా 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే జైలు నిర్మాణానికి కమిటీ రూ.148.58 కోట్లు మంజూరు చేసింది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘యమునా నది ఢిల్లీ జీవనాడి. నది పునరుజ్జీవనం పర్యావరణ లక్ష్యం మాత్రమే కాదు. దాని పరిరక్షణ, శుభ్రత మా ప్రాధాన్యం. వాజిద్‌పూర్ థక్రాన్, ముండ్కా, నరేలా, బవానా, ఔచండి, తాజ్‌పూర్ ఖుర్ద్, కంఝవాలా, మజ్రీ, ఘెవ్‌డా గ్రామం, జౌనాపూర్, బిజ్వాసన్, సలాపూర్, పంజాబ్ ఖోర్, కుతుబ్‌గఢ్, తిక్రీ కలాన్, మహ్మద్‌పూర్ మజ్రీ తర్వాత, మహ్మద్‌పూర్ మజ్రీ ఏరియాల్లో 18 నెలల్లో STPలు పూర్తవుతాయి.
ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమావేశంలో క్యాబినెట్ మంత్రులు పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.