Mayawati | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఎస్పీ
x

Mayawati | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఎస్పీ

అభ్యర్థుల తొలి జాబితాను జనవరి మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.


ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక బహుజన సమాజ్ పార్టీ (BSP) కూడా ఎన్నికల బరిలో నిలవనుంది. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల తొలి జాబితాను జనవరి మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. నగరాన్ని ఐదు జోన్లుగా విభజించామని, అన్ని జోన్లలో అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని బీఎస్‌పీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

‘‘అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రతి మండలానికి కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా పార్టీ కేంద్ర సమన్వయకర్తలు తమ సిఫార్సులను బెహెన్‌జీ ( బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) కి పంపుతారు. వాటి ఆధారంగా పార్టీ అధినేత తుది నిర్ణయం తీసుకుంటారు. జనవరి 15లోగా అభ్యర్థుల జాబితాను ఖరారైపోతుంది. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో చిన్నపాటి సమావేశాలు జరుగుతున్నాయి. ఎజెండాపై చర్చ జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించగానే మాయావతి ప్రచారంలో పాల్గొంటారు, ’’ అని ఆయన తెలిపారు.

2008లో రెండు సీట్లు..

2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసింది. కానీ ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 0.71 శాతం ఓట్ షేర్ సాధించింది. 2015, 2013, 2008లో కూడా పార్టీ రాజధానిలోని మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసింది. 2003లో అధికారిక సమాచారం ప్రకారం 40 స్థానాల్లో పోటీ చేసింది. BSP ఓట్ల శాతం 2015లో 1.13 శాతం, 2013లో 5.35 శాతం, 2008లో 14.05 శాతం, 2003లో 5.76 శాతం సాధించింది. ఆ పార్టీ 2008లో ఢిల్లీలో అత్యధిక ఓట్ షేర్ సాధించి రెండు సీట్లు గెలుచుకుంది.

కల్కాజీ నుంచి సీఎం..

70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ(BJP), ఆప్ మధ్య ఉంటుంది. ఆప్(AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి, ముఖ్యమంత్రి అతిశీ (Atishi) కల్కాజీ నుంచిపోటీ చేస్తున్నారు.

Read More
Next Story