ఎక్కువ చేస్తే ఇలానే ఉంటుంది, పూజ ఖేడ్కర్ విషయంలో..
యూపీఎస్సీ పరీక్షకి తప్పుడు పత్రాలు సమర్పించడం, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేయడంపై వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను కప్పిపుచ్చడం పై వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై శుక్రవారం ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ పరీక్ష రాయడానికి అనుమతించిన వాటికన్నా ఎక్కువసార్లు అటెంప్ట్ చేయడం, చాలా సార్లు తన గుర్తింపును మార్చడం వంటి ఆరోపణలపై ఈ కేసు నమోదు అయింది.
ప్రస్తుతం పూజను ఉద్యోగం నుంచి తప్పించారు. అలాగే షోకాజ్ నోటీస్ ను యూపీఎస్సీ జారీ చేసింది. భవిష్యత్ లో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా కూడా బ్యాన్ విధించింది. అనంతరం దేశ రాజధానిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై చట్టంలోని వివిధ సెక్షన్ లపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ కేసును విచారిస్తోంది.
"UPSC పరీక్షల్లో నిర్ణీత పరిమితికి మించి అదనపు ప్రయత్నాలను పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపించిన శ్రీమతి పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్‌పై UPSC ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. క్రైమ్ బ్రాంచ్‌తో దర్యాప్తు ప్రారంభించాము” అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
కేసు నిర్దిష్ట వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ ఆమె సివిల్ సర్వీసెస్ అభ్యర్థిత్వాన్ని సాధించడానికి ఫోర్జరీ, మోసం, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాలు ఇందులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, వికలాంగుల చట్టాల కింద కేసు నమోదు చేశారు.
2022లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు పరిమితికి మించి పరీక్షకు హాజరయ్యేందుకు ఆమె పేరు, ఆమె తల్లిదండ్రుల పేర్లు, ఆమె ఫోటో, సంతకం, సంప్రదింపు వివరాలు, చిరునామాను మార్చారని UPSC ఆరోపించింది. కేసు గురించి వార్తలు రావడంతో, ఖేద్కర్ మహారాష్ట్రలోని వాషిమ్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు పేర్కొంది.
వాషిమ్ లోని ప్రభుత్వ అతిథి గృహం వెలుపల వివాదాస్పద అధికారిణిని పూజా ఖేద్కర్ విలేకరులతో మాట్లాడారు. ఈ వివాదం గురించి ఇక న్యాయవ్యవస్థలో పోరాడతానని ప్రకటించారు. త్వరలోనే తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఓ ప్రైవేట్ వాహనంలో నాగపూర్ వైపు అనంతరం బయల్దేరి వెళ్లారు.
పూజా ఖేద్కర్ వివాదం యూపీఎస్సీ పరీక్షలోని లోపాలను బహిర్గతం చేసింది. అయితే రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ కావడంతో వెంటనే తప్పులను తెలుసుకుని పూర్తి స్థాయిలో న్యాయమైన చర్యలను ప్రారంభించింది. ప్రజలు ఇన్ని రోజులు తమపై పెట్టుకున్న విశ్వసనీయతను కాపాడుకోవడం కోసం కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని పంపింది.
ఇటీవల మహారాష్ట్రలోని పూణే జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ఖేద్కర్ తనకు అర్హత లేకున్నా బలవంతంగా సౌకర్యాలు కోరడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కింది స్థాయి సిబ్బందితో దురుసుగా ఉండటం వంటి అభియోగాలు ఉన్నాయి. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పూజా ఖేద్కర్ పై ఉన్న వివాదాలు మొత్తం బయటకు వచ్చాయి.
అలాగే చుట్టుపక్కల వారందరినీ బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఆమె పనిచేసిన సమయంలో 'మహారాష్ట్ర గవర్నమెంట్' అని రాసి ఉన్న ఒక ప్రైవేట్ ఆడి (లగ్జరీ సెడాన్) కారుపై ఎరుపు-నీలం రంగు బల్బులు (అత్యున్నత స్థాయి అధికారిని సూచించడం) వాడుకున్నారని తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంలోనే ఆమెను పుణే నుంచి విదర్భలోని వాషిమ్ జిల్లాకు బదిలీ చేశారు. 2022 నాటి యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు పొందిన ఖేడ్కర్, సొంత రాష్ట్రమైన కేడర్ ను కేటాయించారు.
దివ్యాంగుల కోటా దుర్వినియోగంతో పాటు అర్హత లేకున్నా ఓబీసీ కోటాను వాడుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ను నియమించింది. సిబ్బంది, శిక్షణ శాఖ అదనపు కార్యదర్శి మనోజ్ కుమార్ ద్వివేది నేతృత్వంలోని ప్యానెల్ రెండు వారాల్లోగా తన నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.
వికలాంగుల హక్కుల చట్టం, 2016 ప్రభుత్వ రిక్రూట్‌మెంట్/డిపార్ట్‌మెంట్‌లో మొత్తం సీట్లలో కనీసం నాలుగు శాతం రిజర్వ్ చేయాలనే నిబంధన ఉంది. దీనిని పూజా ఖేద్కర్ దుర్వినియోగం చేశారు. వయస్సు నిబంధనలు సడలింపు, మెరుగైన ర్యాంకు కోసం ఈ అడ్డదారులు తొక్కినట్లు తెలిసింది.
Next Story