బంగ్లాదేశ్: లౌకిక వాదానికి బెదిరింపులు, ఫాసిస్టు ముద్రలు
షేక్ హసీనా దేశం నుంచి పారిపోయిన తరువాత చరిత్రను మార్చే పనిని ఇస్లామిక్ శక్తులు చురుకుగా చేస్తున్నాయి. అలాగే జాతిపితపై కూడా ఫాసిస్టు నేత అనే ముద్రను..
బంగ్లాదేశ్ లో కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయిన ఇస్కాన్ బ్రహ్మచారీ స్వామి చిన్మోయ్ దాస్ విషయంలో న్యూఢిల్లీలోని దౌత్యవేత్తలను విపరీత ఆందోళనలకు గురి చేస్తోంది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హిందూ మైనారిటీలపై దాడులకు తెగబడుతూ, జెనో సైడ్ కు పాల్పడుతుందని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
షేక్ హసీనా కాలంలో భారత్ కు అత్యంత నమ్మకమైన మిత్ర దేశంగా బంగ్లాదేశ్ ఉండేది. అయితే బలవంతంగా ఆమెను దేశం నుంచి పారిపోయేలా చేసిన రాడికల్ ఇస్లాం మూకలు, తరువాత భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి.
పక్కంలో బల్లెంలా మారుతున్న బంగ్లా..
ఢాకాలో కొలువుతీరిన కొత్త రాడికల్ ఇస్లాం నాయకులు వెంటనే న్యూఢిల్లీ వ్యతిరేక వైఖరిని అవలంభించడం ప్రారంభించారు. తాజాగా పాకిస్తాన్ నుంచి 25 వేల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకుంది. అంతకుముందు కరాచీ పోర్టు నుంచి నూలు వస్త్రాల కొరకు ప్రత్తిని దిగుమతి చేసుకుంది.
ఆదానీకి చెల్లించాల్సిన పవర్ బిల్లుల విషయంలో నిశ్శబ్ధం పాటించిన ఢాకా ప్రభుత్వం.. తరువాత పవర్ సప్లైని తగ్గించుకుంది. అలాగే షేక్ హసీనా కాలంలో భారత్ తో చేసుకున్న ఒప్పందాలను సైతం సమీక్షించాలని ప్రస్తుత పాలకులు నిర్ణయించారు.
భారత ఉపఖండంలో ప్రబలశక్తిగా ఎదుగుతున్న న్యూఢిల్లీ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందని ప్రపంచ శక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మోదీ నాయకత్వంలో భారత కీర్తి ప్రతిష్టలు ఉన్నత శిఖరాలను చేరుకుంది.
బంగ్లాదేశ్ మాత్రమే కాదు.. చాలాకాలంగా మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులలో భారత వ్యతిరేక శక్తులు తిష్ట వేశాయి. దీని వెనక ఎవరూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అరెస్టులు, నిరసనలు
దాస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) మాజీ సభ్యుడు, ప్రస్తుతం బంగ్లాదేశ్ సమ్మిలిత సనాతని జాగ్రన్ జోటే అనే హిందూ మత సంస్థకు ప్రతినిధిగా ఉన్నారు. హసీనా దేశం నుంచి పారిపోయిన తరువాత హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల విషయంలో చిన్మయ్ దాస్ వారి తరఫున గళం వినిపిస్తున్నారు. ఆవేశపూరిత ప్రసంగాలతో ఆయన అందరిని ఆకర్షిస్తున్నాడు.
నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాస్‌ను దేశద్రోహ నేరం కింద అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లోని కోర్టు అతనికి బెయిల్ నిరాకరించి జైలుకు పంపింది. దీంతో ఆయన మద్దతుదారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నిరసనలు
హిందూ అనుకూల సంస్థలు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంగ్లాదేశ్ హైకమిషన్, దేశంలోని కాన్సులేట్‌ల వెలుపల, ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ప్రదర్శనలు నిర్వహించడంతో దాని ప్రభావం సరిహద్దు అంతటా కనిపించింది. అగర్తలాలో నిర్వహించిన నిరసన బంగ్లాదేశ్ కాన్సులేట్ ధ్వంసానికి దారి తీసింది. ఇది ఢాకాలో భారత వ్యతిరేక ప్రదర్శనలకు ఆజ్యం పోసింది. ఈ ఘటనపై భారత్ వెంటనే క్షమాపణలు చెప్పింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మతపరమైన మైనారిటీల భద్రతను నిర్ధారించడానికి ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతల మోహరింపును కేంద్రం కోరాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో స్పందన..
దాస్ అరెస్ట్ పై ఇటూ భారత్ తో పాటు, హిందూవులు అత్యధికంగా నివసిస్తున్న చట్టోగ్రామ్ లోనూ నిరసనలు ప్రజ్వరిల్లాయి. ఇది బంగ్లాదేశ్ లోని కొందరు రాడికల్ ముస్లింలు ఇస్కాన్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ చేయించింది. "భారతదేశం ఇకపై హసీనాకు అనుకూలమైన బంగ్లాదేశ్‌తో వ్యవహరించడం లేదని గుర్తుంచుకోవాలి" అని తాత్కాలిక ప్రభుత్వంలోని ఒక సలహాదారు అన్నారు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ UN శాంతి పరిరక్షక దళం డిమాండ్‌పై తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్ సార్వభౌమాధికారం కలిగిన దేశమని, భారత్ ఆ విధంగానే వ్యవహరించాలని ఆయన అన్నారు.
భారత్ ప్రచారం జరుగుతోంది...
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, అయితే జరుగుతున్న దాడుల కంటే భారత మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోందని అక్కడి కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశంలో నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో, బంగ్లాలోని అనేక రాజకీయ పార్టీలు, ఇస్లామిస్ట్ సంస్థలు బంగ్లాదేశ్‌లో సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఓడించేందుకు జాతీయ ఐక్యత కోసం పిలుపునిస్తున్నాయి. దీని వెనక హసీనా మద్ధతుదారులు ఉన్నారని కొంతమంది అనుమానిస్తున్నారు.
కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత సోహ్రాబ్ హసన్ మాట్లాడుతూ.. ఆమెను తొలగించిన మూడున్నర నెలల్లోనే ఏ నాయకురాలైనా ఎలా తిరిగి వస్తారని ఆశ్చర్యపోయాడు. "హసీనా వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించిన వారిలో విశ్వాసం లేకపోవడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది" అని బెంగాలీ దినపత్రిక ప్రోథోమ్ అలోలో అతను చెప్పాడు.
బంగ్లాదేశ్‌కు తీవ్రమైన సవాలు..
బంగ్లాదేశ్‌లో "జూలై తిరుగుబాటు"గా పిలవబడే విద్యార్థుల నేతృత్వంలోని ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుంచి, దేశం దాని స్థిరత్వానికి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. సుస్థిరతను పునరుద్ధరించడానికి, ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రముఖ ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ పూర్తిగా విఫలమయ్యాడు. నిరసనల సందర్భంగా విద్యార్థులపై దాడికి ముందున్న పోలీసులపై విశ్వాసం లేకపోవడం వల్ల శాంతిభద్రతలు ఆందోళనకరంగా దిగజారాయి.
యూనస్ విఫలమయ్యాడా?
మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహదారుడిగా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ యూనస్ విఫలమయ్యాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్భణం, ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్న రాజకీయ పార్టీల కారణంగా అశాంతి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
యూనస్ అతని సలహాదారులు రాజకీయ వ్యవస్థను సంస్కరించే పనిలో నిమగ్నమై ఉన్నారని, ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇది రాజకీయ నేతలను కలవరపెడుతోంది.
లౌకికవాదానికి బెదిరింపులు..
బంగ్లాదేశ్‌లో ఇస్లామిస్ట్ శక్తులు బలం ఫుంజుకుంటున్నాయి. ఈ పరిణామాలు లౌకిక వర్గాలలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యార్థి విభాగం నేతలు చాలామంది ఇస్లామిస్ట్ శక్తులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు.
చాలా మంది ప్రజలు కూడా తమ సొంత ఇస్లామిక్ ఎజెండాను ముందుకు తెస్తున్నారు. ఇది దేశంలో తీవ్ర గందరగోళం పరిస్థితులకు కారణం అవుతోంది. దేశం లౌకిక రూపాన్ని మారుతుందని మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేసిన జాతి పిత షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనాలను ఫాసిస్టులగా ముద్ర వేసే ప్రయత్నం అక్కడ విద్యార్థి విభాగం నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే దేశ చరిత్రను తిరగరాసే కసరత్తు, మతపరమైన మైనారిటీలపై దాడులు సమాన స్థాయిలో కొనసాగుతున్నయి.
ముందస్తు సంప్రదింపుల కోసం ఢాకా
బంగ్లాదేశ్ అధికారులు ఈ సంఘటనలను మతపరమైన సంఘటనలు కాకుండా సాధారణ శాంతిభద్రతల సమస్యలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది దేశంలో భారతదేశంలో చాలామందిని సంతృప్తిపరచలేదు. రెండు దేశాలు తమ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులను చురుకుగా ముందుకు తీసుకువెళ్లాలని బంగ్లా అధికారులు కోరుతున్నారు. ఈ నెల 10 న సమావేశం కావలని సూచించింది. కానీ భారత్ మాత్రం ఈ సమావేశం నిర్వహించడానికి అంగీకరించలేదు.
ద్వైపాక్షిక గాయాలను నయం చేసే సమయం..
"బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం బహిరంగంగా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయడం లేదు. కాబట్టి పరిస్థితి ఆందోళనకరమైన నిష్పత్తికి చేరుకోలేదు" అని ఆగ్నేయాసియా దౌత్యవేత్త ఒకరు చెప్పారు. ఏదైన దేశంలో సుదీర్ఘ కాలం పని చేసిన నేత దేశం నుంచి నిష్ర్కమించిన తరువాత ఆయా దేశాలలో అధ్వాన్న పరిస్థితులను చూసినట్లు వెల్లడించారు. తాము బంగ్లాదేశ్ పరిస్థితిని చాలా ఆసక్తికరంగా చూస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీలోని పలువురు దౌత్యవేత్తలు ఇదే వైఖరిని తీసుకున్నారు.
భారతదేశం - బంగ్లాదేశ్ రెండూ తమ పరస్పర ప్రయోజనం కోసం స్థిరమైన సహకార సంబంధాలు అవసరమని వారు భావిస్తున్నారు. వారు ఎంత త్వరగా తమ శాంతంగా ఉంటే భారత ఉపఖండంలో పరిస్థితి అంత శాంతంగా ఉంటుంది.
Next Story