
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు
ప్రధాని మోదీ మౌనంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై సైనిక దాడులను ముమ్మరం చేశాయి. ఈ సందర్భంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌ను మోదీ సందర్శించారు. ఆ సమయంలో అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్‌పై సైనిక దాడి చేయబోతుందని ఆయనకు తెలుసు. మోదీ ఇజ్రాయెల్‌ను వీడిన రెండు రోజులకే దాడి ప్రారంభమైంది. అక్కడ మోదీ చేసిన ప్రసంగమే అందుకు ఉదాహరణ” అని రమేష్ ఎక్స్ లో పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడంలో తానే జోక్యం చేసుకున్నానని అమెరికా అధ్యక్షుడు పలుమార్లు చెప్పినా.. ఈ ఆరోపణలపై ప్రధాని ఖండించలేదని రమేష్ అన్నారు. మోదీ అంగీకారంతోనే భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చిందని, అయితే అమెరికా సుప్రీంకోర్టు ఆ టారిఫ్ విధానం చట్టవిరుద్ధమని పేర్కొందని చెప్పారు.
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులందరి భద్రతపై ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసింది.

