ఇతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలు..
x

ఇతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలు..

భారత కూటమితో జతకట్టిన ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రు లకు తమిళనాడు సీఎం స్టాలిక్ ఎందుకు లెటర్లు పంపారు. వాటిల్లో ఆయన ఏం రాశారు?


నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని తాము అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, మీరు కూడా అలా చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారత కూటమితో జతకట్టిన ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.

నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి శుక్రవారం శాసనసభ్యులు ఆమోదం తెలిపారు.

‘తమిళనాడును నీట్ నుంచి మినహాయించండి. 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు కల్పించండి. దీనిపై మా అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాం. అంగీకారం కోసం మీకు పంపుతున్నాం’ అని రాష్ట్రపతి ముర్మును లేఖలో కోరారు స్టాలిన్.

రాహుల్‌నూ కోరిన స్టాలిన్..

నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌కు కూడా లేఖ రాశారు.

ఈ విధానం గ్రామీణ పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేస్తుందన్నది స్టాలిన్ అభిప్రాయం. తమిళనాడు డిమాండ్‌ను పార్లమెంటులో వినిపించాలని మిమ్మల్ని కోరుతున్నానని రాహుల్‌కు లేఖ రాశారు.

ఎందుకు నీట్ వద్దంటున్నారు?

నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకోవడం, గ్రేస్ మార్కులు కలపడం, చివరకు పరీక్ష రద్దు చేయడం, సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించడం లాంటి పరిణామాల నేపథ్యంలో తమ రాష్ట్రాన్ని ఆ పరీక్ష నుంచి మినహాయించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈ పరీక్షా విధానం వివక్షతో కూడుకున్నదని, గ్రామీణ, పేద విద్యార్థులు వైద్య విద్యకు నోచుకోవడం లేదన్నది ఆయన వాదన.

Read More
Next Story