
కుల గణనను కేంద్ర క్యాబినెట్ ఆమోదం..
‘‘వాస్తవానికి జనాభా లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 2020లో ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది’ - కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కుల ఆధారిత గణనకు(Caste census) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
కుల డేటాను "పారదర్శకంగా మరియు నిర్మాణాత్మకంగా" సేకరిస్తామని వైష్ణవ్ పేర్కొన్నారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, కుల డేటాను ప్రధాన జనాభా గణన కార్యకలాపాలలో భాగం చేయలేదు. 2010లో అప్పటి ప్రధాన మంత్రి దివంగత మన్మోహన్ సింగ్ జనాభా గణనలో కులాన్ని చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సమీక్షించడానికి మంత్రుల బృందం ఏర్పడింది. అనేక రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి . అయితే ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక జనాభా గణనలో కుల డేటాను చేర్చడానికి బదులుగా సామాజిక-ఆర్థిక మరియు కుల గణన (SECC) అని పిలిచే ప్రత్యేక సర్వేను మొగ్గుచూపిందని వైష్ణవ్ హైలైట్ చేశారు.
జనాభా లెక్కలు కేంద్రం పరిధిలోకి వస్తాయని..కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాల వల్ల కుల సర్వేలు చేశాయని చెప్పారు.
వాస్తవానికి జనాభా లెక్కింపు ప్రక్రియ ఏప్రిల్ 2020లో ప్రారంభం కావాల్సి ఉందని, అయితే కోవిడ్ కారణంగా ఆలస్యమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.