CAA కటాఫ్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
x

CAA కటాఫ్‌ను పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం

డిసెంబర్ 31, 2024 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ..


Click the Play button to hear this message in audio format

కేంద్ర ప్రభుత్వం CAAపై కీలక ప్రకటన చేసింది. పౌరసత్వం (సవరణ) చట్టం కటాఫ్ తేదీని డిసెంబర్ 31, 2024 వరకు పొడిగిస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం కల్పించడమే CAA లక్ష్యం. డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చిన మైనార్టీలు..ఏ విధమైన పాస్‌ పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలు లేకుండా దేశంలో ఉండటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజా సడలింపుతో 2015 - 2024 మధ్య ప్రవేశించిన వారికి రక్షణ కల్పిస్తుంది. 2014 తర్వాత పాకిస్తాన్ నుండి వచ్చిన వారికి ఇది పెద్ద ఉపశమనం.

బిల్లు చట్టంగా మారిన సందర్భం..

సీఏఏ డిసెంబర్ 11, 2019న పార్లమెంటులో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. డిసెంబర్ 12న రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)గా మారింది. మోదీ ప్రభుత్వం దీనిని చారిత్రక చర్యగా పేర్కొంటుండగా.. ప్రతిపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏను తొలిసారిన అమలు చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్.

Read More
Next Story