ఫిరాయింపులపై నెటిజన్ల ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పగలదా ?
రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విలవిల్లాడిపోతోంది. దెబ్బలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తోంది. ఈ విషయం ఎక్స్ వేదికను చూస్తే తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విలవిల్లాడిపోతోంది. దెబ్బలు తట్టుకోలేక హాహాకారాలు చేస్తోంది. ఈ విషయం ఎక్స్ వేదికగా పార్టీ చేసిన డిమాండ్ చూస్తే తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపులను నియంత్రించలేని ఎన్నికల కమీషన్ ఎందుకు ? అసెంబ్లీ స్పీకర్ ఎందుకంటు ఆక్రోసించింది. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చాలామంది ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయింపులకు రెడీగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీమారిన కడియంపై పార్టీ సీనియర్ నేత, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు నోటికొచ్చినట్లు మాట్లాడారు. కడియంకు సిగ్గుంటే వెంటనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హరీష్ డిమాండుతోనే బీఆర్ఎస్ ఎంతగా మండిపోతోందో అర్ధమవుతోంది. ఇదే విషయాన్ని ‘అసలీ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా’ అని పార్టీ ఎక్స్ లో ప్రశ్నించింది. ఇంకా ఏమందంటే ‘ప్రజాస్వామ్యం ఖూని అవుతుంటే అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘం చోద్యం చూస్తోంది’. అని మండిపోయింది. ‘ఒకపార్టీ నుండి ఎన్నికైన ఎంఎల్ఏలు మూడునెలల్లోనే ఇంకో పార్టీ కండువా కప్పుకుని జాయిన్ అవుతుంటే వారిపై అనర్హత వేటువేసి చర్యలు తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తున్నారం‘టు నిలదీసింది. ‘పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమీషన్ ఎందుకు నోరిప్పటంలేద’ని దులిపేసింది.. ‘పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వెంటనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాల’ని స్పీకర్, ఎన్నికల కమీషన్ను పార్టీ డిమాండ్ చేసింది.
నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారా ?
హరీష్ మాటల్లోను, పై ట్వీట్ లోను పార్టీ ఆక్రోసం బయటపడింది. దీనిపైన నెటిజన్లు ఫుల్లుగా బీఆర్ఎస్ ను వాయించేస్తున్నారు. కేసీయార్ హయాంలో మొదలైన ఫిరాయింపులను నెటిజన్లు గుర్తుచేశారు. వినయ్ రెడ్డి మాట్లాడుతు మీరు పక్కపార్టీ ఎంఎల్ఏలను లాక్కున్నపుడు ఏమైంది ఈ తెలివితేటలు, మంత్రులను చేసినపుడు బుద్ధి ఏమైంది’ ? అని నిలదీశారు. ‘టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాక్కుని మంత్రులను చేసినపుడు వారితో రాజీనామాలు చేయించాలని ఎందుకు ఆలోచించలేదు’ అంటు వసంత్ అనే నెటిజన్ ప్రశ్నించారు. బీఎస్పీ తరపున గెలిచిన ముగ్గురు ఎంఎల్ఏలను లాక్కున్నపుడు వాళ్ళపై అనర్హత వేటు పడలేదు కదా అని ఉప్పు పటేల్ అనే నెటిజన్ గుర్తుచేశారు.
పార్టీ ఫిరాయింపులపైన, ఎంఎల్ఏల అనర్హతపైన బీఆర్ఎస్, కేసీయార్, హరీష్ మాటలు విని గురివిందగింజ నవ్వుకుంటోందని విజయ్ పుట్టపాగ అనే నెటిజన్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్ళు కేసీయార్ యధేచ్చగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినపుడు ఈ నీతులు, బుద్ధులు ఏమైందని నిలదీశారు. పదేళ్ళల్లో బీఆర్ఎస్ చేసిందేమిటో వెనక్కితిరిగి చూసుకోవాలని హితవుపలికారు. టీడీపీఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్న విషయాన్ని హరీష్, కేటీయార్ మరచిపోయినట్లున్నారంటు మరికొందరు నెటిజన్లు చురకలేశారు.
బీఆర్ఎస్ నిజంగా గురివింద గింజేనా ?
ఇపుడు విషయం ఏమిటంటే పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ స్పీకర్ ను కలిసినా ఉపయోగం కనబడలేదు. ఇదే సమయంలో దానంపై అనర్హత వేటు వేయాలని రాజుయాదవ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసినా ఉపయోగంలేకపోయింది. ఎంఎల్ఏల అనర్హతపై చర్యలు తీసుకోవాల్సింది స్పీకరే కాని కోర్టు కాదు. కేసీయార్ హయాంలో పార్టీమారిన ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్ ఎంతపోరాడినా ఉపయోగంలేకపోయింది. కోర్టులో కేసులు వేసినా లాభంలేకపోయింది. అదే సీన్ ఇపుడు కూడా రిపీటవుతుందంతే.
Next Story