పీఎం కిసాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఇంకా ఏం కావాలి?
x

పీఎం కిసాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఇంకా ఏం కావాలి?

గ్రామీణ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి, ప్రజలకు ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే వీటికి అవసరమైన మేర..


ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని ప్రకటించినప్పటికీ ముఖ్యమైన పథకాల్లో కోతలు, వ్యవస్థాపరమైన లోపాలు మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆలంబనగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లోతైన వ్యవస్థాగత వైఫల్యాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.

MGNREGA పథకం నైపుణ్యం లేని ఉపాధిని కోరే మాన్యువల్ పని చేయడానికి ఇష్టపడే గ్రామీణులకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరంలో కనీసం వంద రోజుల పని కల్పించడానికి ఉద్దేశించింది. ఇది చట్టపరంగా ప్రజలకు పని కల్పించడానికి హామీ ఇస్తుంది. PM-KISAN భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో (నేరుగా బ్యాంకు ఖాతాలకు పంపబడుతుంది) సంవత్సరానికి రూ. 6,000 ఆదాయ మద్దతును అందిస్తుంది.
రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ రెండు పథకాలకు కేటాయింపులను పెంచే అవకాశం ఉంది, అయితే ఎక్కువ నిధులు కుమ్మరించడం సరిపోదని, అవి ప్రభావవంతంగా ఉండాలంటే సమగ్ర పరిశీలన అవసరమని విమర్శకులు సూచిస్తునన మాట.
పెరిగిన చెల్లింపులు, ద్రవ్య లోటు
మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం PM-KISAN పథకం కింద రైతులకు వార్షిక చెల్లింపును ప్రస్తుతం కుటుంబానికి రూ.6,000 నుంచి రూ.8,000 లేదా రూ.9,000కి పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్‌లో వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, పీఎం-కిసాన్ పథకం యొక్క 17వ విడతను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు, ఇందులో 9.26 కోట్ల మంది రైతులు రూ. 20,000 కోట్లకు పైగా ప్రయోజనాలను పొందుతున్నారు.



పెరిగిన చెల్లింపుల కోసం, పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ప్రభుత్వం ద్రవ్య లోటును నిర్వహించవలసి ఉంటుంది. FY24 (ఆర్థిక సంవత్సరం 2023-24) కోసం ద్రవ్య లోటు GDPలో 5.9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. FY26 నాటికి GDPలో 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి ఖర్చు- రాబడులను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయడం అవసరం.
పెరిగిన PM-KISAN చెల్లింపుల కోసం నిధులను వెచ్చించడానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్న వ్యయాలను తగ్గించుకోవచ్చు.అలాగే దుబారాలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, అవినీతిని తగ్గించడం, ప్రభుత్వ వ్యయం సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలని ఇక్కడ చెప్పవచ్చు.
అసలు కేటాయింపు
2024 మధ్యంతర బడ్జెట్ MGNREGA పథకానికి రూ. 86,000 కోట్లు కేటాయించింది, ఇది FY24 సవరించిన అంచనాల మాదిరిగానే ఉన్నప్పటికీ, ఇది మునుపటి బడ్జెట్ కేటాయింపుల కంటే 43.33 శాతం ఎక్కువ. అయితే, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్, NREGA సంఘర్ష్ మోర్చా, గ్రామీణ కార్మికులతో కలిసి పనిచేస్తున్న సంస్థల కూటమికి చెందిన నాయకుడు అపూర్వ గుప్తాను ఉటంకిస్తూ, 2023-24లో ఉపాధి ధోరణిని పరిగణనలోకి తీసుకుంటే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 32,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉంటాయని తెలిపారు.
కేటాయించిన నిధుల్లో రూ.86,000 కోట్లలో కేవలం రూ.54,000 కోట్లు మాత్రమే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎఫ్‌వై 25లో వినియోగానికి అందుబాటులో ఉంటాయి. ఈ పథకానికి సంబంధించిన పలు వివరాలను పరిశీలిస్తే కేటాయించిన మొత్తం లో ఖర్చు పెట్టిన దాఖలా కనిపించట్లేదు.
వివిధ రకాల సోర్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇది వాస్తవ, క్షేత్ర స్థాయి అంచానాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. కొన్ని సంవత్సరాల్లో ఎక్కువ మొత్తం, తదుపరి సంవత్సరం తక్కువ మొత్తం కేటాయించారు. FY22లో రూ. 73,000 కోట్ల నుంచి FY24లో రూ. 60,000 కోట్లకు అంచనాలు తగ్గించారు. FY25 కోసం మధ్యంతర బడ్జెట్ కేటాయింపులు రూ. 86,000 కోట్లకు పెంచారు. నిజానికి ప్రజా అవసరాల కోసం బడ్జెట్ లో దాదాపు రూ. 2.72 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
వాగ్థాన భంగం..
100 రోజుల ఉపాధి హామీ పథకం పై ప్రజలకు ప్రభుత్వాలు చేసిన వాగ్ధానాలు ఇప్పటి వరకూ నెరవేరలేదు. 2023 లో ప్రతి కుటుంబానికి కేవలం 42 రోజులకే పని కల్పించింది. చేసిన పనికి ఆలస్యంగా కూలీ ఇవ్వడం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది.
కార్మికులు పని పై శ్రద్ధ లేకుండా చేస్తుందని, పథకం విశ్వసనీయతను దెబ్బతీస్తుందని నిఫుణులు చెబుతున్నారు. చట్టబద్దమైన ఆదేశాలు ఉన్నప్పటికీ 10 శాతం కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే మాత్రమే 100 రోజుల పనిని పొందాయి. తాజా బడ్జెట్ ప్రకారం, చెల్లించని బకాయిలు రూ. 16,000 కోట్లకు పైగా ఉన్నాయి, ఇది పథకం అనిశ్చిత ఆర్థిక ఆరోగ్యాన్ని స్పష్టంగా సూచిస్తుంది.
PM-KISAN మినహాయింపులు
చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయాన్ని అందించడానికి రూపొందించిన పిఎం-కిసాన్ పథకం 11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. అయితే ఇది కౌలు రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో విఫలం అయిందని చెప్పవచ్చు. ఇది ఈ పథకంలో లోపాన్ని సూచించింది.



ఈ పథకానికి దాదాపు 2.4 నుంచి 5. 37 కోట్ల వ్యవసాయ కుటుంబాలు దూరంగా ఉన్నాయని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది పథకం పరిమితిని, పరిధిని హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా, తరచుగా మార్పులు, డిజిటల్ ఆధారాల సమర్పణ వలన చాలా మంది రైతులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో ఉన్నవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు.
MGNREGA కోసం బడ్జెట్ కేటాయింపులలో గణనీయమైన పెరుగుదల అత్యవసరం, సకాలంలో వేతన చెల్లింపులు జరుగుతున్నాయని నిర్ధారించడానికి, బ్యూరోక్రాటిక్ జాప్యాలను తగ్గించడానికి బలమైన యంత్రాంగం అవసరం. PM-KISAN కోసం, చిన్న, సన్నకారు రైతులకు నిజమైన మద్దతు అందించడానికి వార్షిక ఆర్థిక సాయంలో అర్థవంతమైన పెరుగుదల కీలకం. అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, సమ్మిళిత కవరేజీని నిర్ధారించడం పథకాన్ని ప్రజలకు చేరువ చేయడానికి అవసరమైన దశలు. ఇలా అయితేనే పథకాలు సమర్థవంతంగా ప్రజలకు నేరుగా చేరి లబ్ది పొందుతారు.
Read More
Next Story