బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేనా?
x

బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేనా?

నేటీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో మొత్తం ఆరు బిల్లులు సహ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన బడ్జెట్ ను ..


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు.

బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ, వృద్ధిపై కార్డు, సర్వే లోక్‌సభకు సమర్పించబడుతుంది. ఈ సర్వేలో వివిధ ఆర్థిక రంగాల పనితీరు, ఉపాధి, GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్ లోటు వంటి వాటి గురించిన వివరాలు ఉంటాయి.
ఈ సెషన్‌ ఆగస్టు 12 వరకు జరుగుతాయి. ఇందులో ప్రభుత్వం 90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని భర్తీ చేసే బిల్లుతో సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. అలాగే జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలుపుతుంది. .
బడ్జెట్ సమర్పణ తర్వాత జరిగే చర్చ గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. బీఏసీ సమావేశంలో ఇప్పటికే ఈ సూచనలు కనిపించాయి. కాంగ్రెస్ సహా ఇండి కూటమి సభ్యులు అనేక వివాదాస్పద అంశాలతో కూడిన జాబితాపై ప్రభుత్వం పై ప్రశ్నలు సంధించేందుకు సిద్ధం అయ్యారు. కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం తర్వాత తొలి సెషన్‌లో ప్రతిపక్షం పలు అంశాలపై సమర్థవంతంగా చర్చించలేకపోయింది.
కన్వర్ యాత్రపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తినుబండారాలు అమ్మే వారి వివరాలు కచ్చితంగా ప్రదర్శించాలని ఆదేశించిన నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ ఈ అంశాన్ని సభలో లేవనెత్తాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ ఇప్పటికే హింట్ ఇచ్చింది. అలాగే నీట్ పేపర్ లీక్ లు సహ ఇతర సమస్యలపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తినుబండారాల యజమానులు తమ పేర్లను ప్రదర్శించే బోర్డులను పెట్టాలనే వివాదాస్పద ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కొన్ని ఎన్డీఏ పక్షాలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఉత్తర్వులపై ఇప్పటికే కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాన్ని నిందించింది, దీనిని "మతవాద, విభజన" అని పేర్కొంది. ముస్లింలు, షెడ్యూల్డ్ కులాలను వారి గుర్తింపును బలవంతంగా బహిర్గతం చేయడం లక్ష్యంగా చేసుకుందని విమర్శించింది. పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లు ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశాయి.
మరోవైపు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అఖిలపక్ష సమావేశంలో ప్రసంగిస్తూ, సీనియర్ నేతల ప్రసంగాల సమయంలో అంతరాయాలను నివారించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు. పార్లమెంటు ప్రారంభ సమావేశంలో, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తూ, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో పదే పదే అంతరాయం కలిగింది.


Read More
Next Story