Mamata Banerjee | ‘చొరబాట్లను బీఎస్‌ఎఫ్ ప్రోత్సహిస్తుంది’
వెస్ట్ బెంగాల్ సీఎం మమత కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌ఎఫ్ సాయంతో బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులను తమ రాష్ట్రంలోకి పంపుతోందని ఆరోపించారు.
బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి చొరబాటుదారులను భారత్‌లోకి ప్రవేశించేందుకు సరిహద్దు భద్రతా దళాలు సహకరిస్తున్నాయని ఫలితంగా రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బీఎస్‌ఎఫ్ ప్రయత్నిస్తోందని టీఎంసీ (TMC) చీఫ్ మమత (Mamata Banerjee) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమే ఇలా చేయిస్తోందన్నారు.
"ఇస్లాంపూర్, సీతాయ్, చోప్రా సరిహద్దు ప్రాంతాల ద్వారా చొరబాటుదారులను దేశంలోకి ప్రవేశించడానికి BSF జవాన్లు అనుమతిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వమే BSFతో ఇలా చేయిస్తుంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తో మాకు సత్సంబంధాలున్నాయి. సరిహద్దుకు ఇరువైపులా మేం శాంతిని కోరుకుంటున్నాం. రాష్ట్రంలోకి చొరబాటుదారులు ఎక్కడెక్కడో ఉంటున్నారో తెలుసుకోవాలని డీజీపీ రాజీవ్ కుమార్‌ని అడుగుతా. కేంద్రానికి లేఖ కూడా రాస్తా" అని అసెంబ్లీలో అన్నారు.
Next Story