Utter Pradesh | సంభాల్ పురాతన ఆలయ బావి నుంచి విరిగిన విగ్రహాలు లభ్యం
x

Utter Pradesh | సంభాల్ పురాతన ఆలయ బావి నుంచి విరిగిన విగ్రహాలు లభ్యం

ఉత్తరప్రదేశ్‌ సంభాల్‌లో పురాతన దేవాలయం సమీపంలోని బావి నుంచి సోమవారం విరిగిన మూడు హిందూ దేవుళ్ల విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.


ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కొత్తగా వెలికితీసిన పురాతన దేవాలయం సమీపంలోని బావి నుంచి సోమవారం విరిగిన మూడు హిందూ దేవుళ్ల విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 1978 తర్వాత మొదటిసారిగా శివ-హనుమాన్ దేవాలయాన్ని డిసెంబర్ 14న తిరిగి తెరిచారు. బావిని తవ్వుతుండగా విగ్రహాలు లభ్యమయ్యాయని, వాటిలో ఒకటి గణేశుడి విగ్రహం కాగా, మరొకటి కార్తికేయ విగ్రహంలా కనిపిస్తోందని సంభాల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీష్ చంద్ర తెలిపారు. ఆలయాన్ని శుభ్రం చేసిన అనంతరం విద్యుత్‌ కనెక్షన్‌ను పునరుద్ధరించారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

సంభాల్ పోలీస్ సూపరింటెండెంట్ క్రిషన్ కుమార్, జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా ఆదివారం ఆలయంలో ప్రార్థనలు చేశారు. సంభాల్‌లోని జిల్లా యంత్రాంగం అనధికార నిర్మాణాలను క్లియర్ చేయడానికి డ్రైవ్‌ను కూడా ప్రారంభించింది. కోర్టు ఆదేశాలతో నవంబర్ 24 న మొఘల్ కాలం నాటి మసీదులో సర్వే నిర్వహించిన సందర్భంగా హింస చెలరేగి నలుగురు చనిపోయారు.

Read More
Next Story