వాయు, నీటి కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్సే’ కారణం: ఢిల్లీ సీఎం
x

వాయు, నీటి కాలుష్యానికి బీజేపీ 'డర్టీ పాలిటిక్సే’ కారణం: ఢిల్లీ సీఎం

యమునా నదిలో నురుగును తగ్గించేందుకు లికాన్ ఆధారిత డీఫోమర్లను వినియోగించునున్నట్లు ఢిల్లీ సీఎం అతిశీ తెలిపారు.


ఢిల్లీలో పెరిగిపోతోన్న వాయు, నీటి కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్సే కారణమని ముఖ్యమంత్రి అతిశీ అన్నారు. శీతాకాలం ప్రారంభం కావడంతో జాతీయ రాజధానిలో గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభించింది. వివిధ ప్రదేశాలలో ముఖ్యంగా కాళిండికుంజ్ వద్ద యమునా నదిలో విషపూరిత నురుగు గురించి కూడా మాట్లాడారు.

AAP అధికారంలో ఉన్న పంజాబ్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన అతిశీ.. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గడానికి BJP పాలిత హర్యానాలో 'పరాలీ' (వరి పొట్టు) దహనం, డీజిల్ బస్సులు, ఇటుక బట్టీలే కారణమని ఆరోపించారు. యూపీ నుంచి ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులోని కౌశాంబి బస్ డిపోకు వేల సంఖ్యలో డీజిల్ బస్సులు చేరుకోవడం, ఎన్‌సీఆర్‌లోని ఇటుక బట్టీలు, ఆ ప్రాంతంలోని థర్మల్ ప్లాంట్లు కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌కు కారణమయ్యాయని పేర్కొన్నారు.

యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థజలాలను శుద్ధి చేయకుండా వదిలేయడం వల్ల ఢిల్లీలోని యమునా నదిలో నురుగు కనిపిస్తోందని. హర్యానా రోజుకు 165 మిలియన్ గ్యాలన్ల (MGD) శుద్ధి చేయని వ్యర్థ జలాలను బాద్‌షాపూర్, ముంగేష్‌పూర్, ఇతర కాలువల ద్వారా యమునాలోకి విడుదల చేస్తోందని అయితే 65 MGD కలుషిత నీటిని UP వివిధ కాలువల ద్వారా నదిలోకి వదులుతోందని చెప్పారు.

2021లో 71,300గా నమోదయిన వరిపొట్టు దహనాలను 2023లో 36,600కి పంజాబ్ తగ్గించిందని అతిశీ విలేకరులకు చెప్పారు. "ఈ సంవత్సరం కూడా ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పంజాబ్‌లో 1105 నుంచి 811 వరకు 27 శాతం తగ్గుదల నమోదైంది" అని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది హర్యానాలో వరిపొట్టు దహనాలు 341 నుంచి 417కు పెరిగాయని, యూపీలో గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్ 1 నుంచి 15 మధ్య కాలంలో ఈ సంఖ్య 244 నుంచి 417కి పెరిగిందని వివరించారు.

"పంజాబ్ ప్రభుత్వం వరిపొట్టు దహనాన్ని తగ్గించగలిగితే, హర్యానా, యూపీలోని బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు?" అని ప్రశ్నించారు.

యమునా నదిలో నురుగు పొరను తగ్గించేందుకు ఆదివారం రాత్రి నుంచి సిలికాన్ ఆధారిత డీఫోమర్ల వినియోగం ప్రారంభమవుతుందని అతిషి తెలిపారు.

Read More
Next Story