బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య ఏవరంటే..
బెంగళూరు సౌత్ నుంచి ఎన్నికయిన BJP MP తేజస్వి సూర్య త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు.
బెంగళూరు సౌత్ నుంచి ఎన్నికయిన BJP MP తేజస్వి సూర్య త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. చెన్నైకి చెందిన కర్ణాటక గాయకురాలు భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 4, 2025న ఒకటవబోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
శివశ్రీ ఎవరు?
శివశ్రీ స్కందప్రసాద్ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బీటెక్ (బయో ఇంజినీరింగ్) పూర్తి చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA, మద్రాసు సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA చదివారు. నడవడం, ట్రెక్కింగ్‌కు వెళ్లడం, సైకిల్ తొక్కడం ఇష్టపడతారు. ఈమె యూట్యూబ్ ఛానెల్‌కు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జనవరి 2024లో శ్రీ రామ నవమి సందర్భంగా కన్నడ భక్తి గీతం 'పూజిసలేండే హూగల తాండే'ని పాడారు. దాన్ని తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఇటువంటి ప్రయత్నాలు దోహదపడతాయని ఆమెను ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఇక సూర్య గురించి..
1990లో జన్మించిన తేజస్వి సూర్య..కళాశాల రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో పనిచేశారు. అక్కడి నుంచే రాజకీయ ప్రయాణం మొదలైంది. సెప్టెంబరు 26, 2020లో భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశాడు. 29 సంవత్సరాల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 17వ లోక్‌సభలో 34 ఏళ్ల వయసులో మరోసారి ఎన్నిక పిన్న వయసులో ఎన్నికయిన ఎంపీగా గుర్తింపుపొందారు. ఇటీవల గోవాలో ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయ ఎంపీ కూడా సూర్యనే.