Delhi Polls | బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. అదనంగా మరిన్ని హామీలు..
మహిళలకు రూ.2,500, వృద్ధులకు పింఛన్, రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్లు, పండుగలకు ఫ్రీగా మరో, ఆయుష్మాన్ భారత్ వర్తింపు, అదనంగా రూ. 5లక్షలకు పెంపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో(Manifesto) రిలీజ్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను చదివి వినిపించారు. బీజేపీ తన మ్యానిఫెస్టోకు ‘సంకల్ప పత్రం’ అని నామకరణం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఇప్పటికే అమలులో ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని కాషాయ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ పండగలకు అదనంగా మరో రెండు..
‘అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలో 'ఆయుష్మాన్ భారత్' (Ayushman Bharat) పథకం అమలు చేయడంతో పాటు అదనంగా ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు పెంచుతాం. పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు అదనంగా ఇస్తా. హోళీ, దీపావళి పండుగలకు ఒక్కో సిలిండర్ ఉచితంగా ఇస్తాం. 60-70 ఏళ్ల మధ్య వృద్ధులకు నెలకు రూ. 2,500, 70 సంవత్సరాల పైబడి వారికి రూ.3 వేలు అందజేస్తాం. " అని నడ్డా పేర్కొన్నారు.
తమ మ్యానిఫెస్టో ఢిల్లీ అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పుకొచ్చిన నడ్డా.. చివరగా ఆప్(AAP) ప్రభుత్వ సంక్షేమ పథకాలలో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫలితాలను 8న ప్రకటిస్తారు.