
బీహార్ ఎన్నికలు: పోలింగ్‌లో భారీగా పాల్గొన్న మహిళా ఓటర్లు..
అధికార మళ్లీ తమదేనని ప్రచారం చేసుకుంటున్న ఎన్డీఏ కూటమి నేతలు ..
బీహార్(Bihar) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఓటింగ్‌లో మహిళలు భారీగా హాల్గొన్నారని, వారు అభివృద్ధి, సుపరిపాలన అందించే ఎన్డీఏ(NDA) కూటమికి ఓట్లు వేశారని బీజేపీ(BJP) ప్రచారం చేసుకుంటోంది.
అత్యధిక పోలింగ్ శాతం నమోదు..
నవంబర్ 11 న బీహార్‌లో మొత్తం 66.91 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. 1952లో జరిగిన మొదటి రాష్ట్ర ఎన్నికల తర్వాత ఇదే అత్యధికం. అత్యధిక మహిళా ఓటర్ల పోలింగ్‌లో పాల్గొనడం రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్‌లో స్త్రీల ఓటింగ్ 69.04 శాతంగా నమోదు కాగా, పురుషుల ఓటింగ్ 61.56 శాతంగా నమోదైందని కూడా పేర్కొంది. మంగళవారం జరిగిన రెండో, చివరి దశ పోలింగ్‌లో మహిళా ఓటర్లు 74.03 శాతం మంది ఓటు వేయగా, పురుషులు 64.1 శాతం మంది ఓటు వేశారు.
Bihar election 2025 has been the most gender-inclusive election since Independence.
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) November 12, 2025
1️⃣ Women in Bihar have voted decisively!
Phase 1: Female turnout 7.48% higher than male turnout.
Phase 2: Female turnout 9.93% higher than male turnout.
2️⃣ Compare this to Bihar’s first… pic.twitter.com/pgaN70Fkh1
14న ఫలితాలు..
నవంబర్ 11న బీహార్‌లో రెండో దశ పోలింగ్ ముగిసినప్పుడు.. ఎగ్జిట్ పోల్స్ NDAకి అనుకూలంగా వచ్చాయి. మహాఘట్బంధన్(Mahagathbandhan) రెండో స్థానంలో నిలిచింది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జాన్ సురాజ్ పార్టీకి కేవలం 5 సీట్లు వస్తాయని అంచనా వేశారు. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెలువడతాయి.

