బీహార్ ఎన్నికలు: కాంగ్రెస్ నుంచి 48 మంది అభ్యర్థులు
x
బీహార్ యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాష్ గరీబ్ దాస్ (ఎడమ)

బీహార్ ఎన్నికలు: కాంగ్రెస్ నుంచి 48 మంది అభ్యర్థులు

నామినేషన్ల దాఖలు..


Click the Play button to hear this message in audio format

బీహార్ (Bihar) అసెంబ్లీ తొలి విడద ఎన్నికలకు (Assembly Polls) సంబంధించి కాంగ్రెస్(Congress) పార్టీ 48 మంది అభ్యర్థులను ఫైనల్ చేసింది. వీరంతా తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్‌ను కుటుంబ స్థానం నుంచి కడ్వా నుంచి సీఎల్‌పీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్‌ను బరిలోకి దింపారు. ఆర్జేడీతో సహా మహాఘట్‌బంధన్‌లోని మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రాకముందే తమ అభ్యర్థులను ప్రకటించింది.


ఎవరు ఎక్కడి నుంచి?

ఇక పార్టీ బీహార్ యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాష్ గరీబ్ దాస్‌ను బచ్వాడ స్థానం నుంచి పోటీకి నిలిపింది. జయేష్ మంగళ్ సింగ్ బాగహా నుంచి, అమిత్ గిరి నౌతాన్ నుంచి, అభిషేక్ రంజన్ చన్పాటియా స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. బెట్టియా స్థానం నుంచి వాసి అహ్మద్‌ను, రక్సౌల్ నుంచి శ్యామ్ బిహారీ ప్రసాద్‌ను అభ్యర్థిగా బరిలో నిలిచారు. గోవింద్‌గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్‌ను, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ తున్నాను రంగంలోకి దింపారు. బత్నాహా-ఎస్సీ స్థానం నుంచి పార్టీ నాయకుడు నవీన్ కుమార్, బేనిపట్టి నియోజకవర్గం నుంచి నళిని రంజన్ ఝా, ఫుల్పరస్ స్థానం నుంచి సుబోధ్ మండల్ బరిలో నిలిచారు. ఫోర్బ్స్‌గంజ్ నుంచి మనోజ్ విశ్వాస్‌ను, బహదూర్‌గంజ్ నుంచి మస్వర్ ఆలంను, మణిహరి నుంచి మనోహర్ ప్రసాద్ సింగ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. పూనమ్ పాశ్వాన్ కోర్హా స్థానంలో, సరితా దేవి సోన్‌బర్షా-ఎస్సీ స్థానం నుంచి, మిథిలేష్ కుమార్ చౌదరి బేనీపూర్ నుంచి, ఉమేష్ రామ్ సరిత సక్రా నుంచి పోటీ చేయనున్నారు. ముజఫర్‌పూర్‌ నుంచి బిజేంద్ర చౌదరి, గోపాల్‌గంజ్‌ నుంచి ఓం ప్రకాష్‌ గార్గ్‌, కుచైకోట్‌ నుంచి హరి నారాయణ్‌ కుష్వా, లాల్‌గంజ్‌ నుంచి ఆదిత్య కుమార్‌ రాజా బరిలోకి దిగారు.

వైశాలి స్థానం నుంచి సంజీవ్ సింగ్, రాజా పకర్-ఎస్సీ స్థానం నుంచి ప్రతిమ కుమారి, రోసెరా-ఎస్సీ నియోజకవర్గం నుంచి బ్రజ్ కిషోర్ రవి, బచ్వారా స్థానం నుంచి శివ ప్రకాష్ గరీబ్ దాస్ పోటీ చేయనున్నారు. బెగుసరాయ్‌ నుంచి కాంగ్రెస్‌ అమితా భూషణ్‌, ఖగారియా నుంచి చందన్‌ యాదవ్‌, బెల్‌దౌర్‌ నుంచి మిథ్లేష్‌ కుమార్‌ నిషాద్‌ పేరును ప్రతిపాదించారు. భాగల్‌పూర్ నుంచి అజిత్ కుమార్ శర్మ బరిలోకి దిగారు. సుల్తాన్‌గంజ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లాలన్‌ యాదవ్‌, అమర్‌పూర్‌ నుంచి జితేంద్ర సింగ్‌, లఖిసరాయ్‌ నుంచి అమ్రేష్‌ కుమార్‌ (అనీష్‌), బార్బిఘా నుంచి త్రిసుల్‌ధారి సింగ్‌, బీహార్‌ షరీఫ్‌ నుంచి ఒమైర్‌ ఖాన్‌, నలంద నుంచి కౌశలేంద్ర కుమార్‌ బరిలోకి దిగనున్నారు.

మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 17, రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 20.

Read More
Next Story