ఐసీయూలో ఆప్ మంత్రి అతిషి..
x

ఐసీయూలో ఆప్ మంత్రి అతిషి..

ఢిల్లీలో తాగునీటి సమస్య తలెత్తింది. పక్క రాష్ట్రం నుంచి నీటి వాటా తగ్గింది. దాంతో నిరాహార దీక్షకు పూనుకున్నారు ఆప్ జల మంత్రిత్వ శాఖ మంత్రి అతిషి.


ఢిల్లీలోని ఆప్ జల మంత్రిత్వ శాఖ మంత్రి అతిషిని లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసియు విభాగంలో చేర్చారు. దేశ రాజధానికి నీళ్లివ్వాలని ఆమె ఐదురోజులుగా నిరవధిక నిరాహార దీక్షచేస్తున్నారు. ఘగర్ లెవల్స్ పడిపోవడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.

"హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కోసం మంత్రి అతిషి గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఘగర్ లెవల్స్ అర్ధరాత్రి 43, తెల్లవారుజామున 3 గంటలకు 36కి పడిపోయాయి. LNJP హాస్పిటల్ వైద్యులు వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు." అని పార్టీ చెప్పింది. అతిషి జూన్ 21న నిరాహార దీక్ష ప్రారంభించారు.

వాటా తగ్గించిన హర్యానా..

తాగునీటి అవసరాలకు ఢిల్లీ పక్క రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, హర్యానాలపై ఆధారపడుతుంది. హర్యానా నుంచి 613 లక్షల గ్యాలెన్లు రావాలి. కొన్ని వారాలుగా అక్కడి నుంచి 513 లక్షల గ్యాలెన్లు మాత్రమే వస్తున్నాయి. 100 లక్షల గ్యాలెన్లు తక్కువ కావడం వల్ల ఢిల్లీలోని 28 లక్షల మంది మంచినీటి కొరత ఏర్పడింది. హర్యానా రాష్ట్రంలోని హత్నికుండ్ బ్యారేజీ అన్ని గేట్లను మూసివేశారని అతిషి గతంలో ఆరోపించారు. తమ వాటా దక్కేవరకు దీక్ష విరమించనని చెప్పారు.

Read More
Next Story