
‘కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లపై GSTనైనా తగ్గించండి’
కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు అసహనం..
దేశ రాజధానిలో వాయు కాలుష్యం(Air pollution) పెరిగిపోయింది. గాలి నాణ్యత బాగా పడిపోయింది. పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక ఇళ్లలో స్వచ్ఛమైన గాలి కోసం కొంతమంది ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే అవి మధ్యతరగతి, సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో లేవు. పైగా వాటిపై కేంద్రం 18 శాతం GSTని వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్లపై GSTని 5శాతానికి తగ్గించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టు (Delhi High Court)లో ఓ పిటీషన్ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం దాన్ని విచారించింది..“ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అధికారులు దాన్ని ఎలాగూ అందించలేకపోతున్నారు. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లయినయినా ప్రజలకు అందుబాటులో ఉంచండి.’’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.

