
SIR ధృవీకరణ దశపై EC, TMC చీఫ్ మధ్య వాగ్వాదం..
సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో మాత్రమే విచారించాలని భావిస్తోన్న ఈసీ..
పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రంలో S.I.R పూర్తయ్యింది. తర్వాత ప్రక్రియ ధృవీకరణ దశ. ఇక్కడే ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య కొంత ఘర్షణ వాతావరణం తలెత్తింది. సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO) లేదా అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రమే విచారణ నిర్వహించాలని కమిషన్ భావిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లో చాలా మంది EROలు జూనియర్ అధికారులు. SDOగా అర్హత ఉన్న కొంతమంది WBCS అధికారులకు ఆ బాధ్యత అప్పగించలేదు. దీన్ని విధానపర లోపంగా పరిగణిస్తూ.. విచారణలు ప్రారంభించే ముందు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(EC) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే తన సొంత అధికారులను నియమిస్తామని చెప్పింది.
ఓటర్ల నమోదులో అనేక వ్యత్యాసాలు..
ఈ వారం ప్రారంభంలో ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం దాదాపు 32 లక్షల మంది ఓటర్లు 2002 SIR తర్వాత వచ్చిన జాబితాలతో ఏ మాత్రం సంబంధం లేదు.
సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు..
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్‌పై నమ్మకం లేకపోవడంతో ప్రతి హియర్ వెరిఫికేషన్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మ పరిశీలకులుగా నియమించాలనే EC నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం (డిసెంబర్ 19) జారీ చేసిన ఆదేశాలు పేర్కొంది..ఈ బాధ్యత ప్రధానంగా గ్రూప్ బి లేదా ఉన్నత స్థాయి కేంద్ర ప్రభుత్వ అధికారులకు అప్పగిస్తారు. డిసెంబర్ 12న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం సూక్ష్మ పరిశీలకుల నియామకాన్ని కోరుతూ కమిషన్‌కు లేఖ రాసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు, LIC, కోల్ ఇండియా, ఆదాయపు పన్ను శాఖ లాంటి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి పరిశీలకులను నియమించడానికి కమిషన్ CEO కార్యాలయానికి అనుమతి ఇచ్చింది. సూక్ష్మ పరిశీలకులకు రూ. 30వేల గౌరవ వేతనం లభిస్తుంది.
సూక్ష్మ పరిశీలకుల బాధ్యతలు..
వీరు రాష్ట్ర CEO పర్యవేక్షణలో పని చేస్తారు. ఆయన కార్యాలయం వారికి శిక్షణ కూడా అందిస్తుంది. సూక్ష్మ పరిశీలకులు గణన ఫారమ్‌లు, ఓటర్ల జనన, మరణ ధృవీకరణ పత్రాలు, విచారణలకు హాజరైన ఓటర్లు సమర్పించిన పత్రాలను ధృవీకరిస్తారు. అదనంగా ఓటర్ల జాబితాలో వ్యత్యాసాలను గుర్తించడం, గణాంక విశ్లేషణ నిర్వహించడం కూడావీరి బాధ్యతే. ఈ కేంద్ర ప్రభుత్వ అధికారుల భద్రత రవాణా కోసం జిల్లా ఎన్నికల అధికారులు (DEOలు) ఏర్పాట్లు చేస్తారు.
ప్రారంభం కానున్న విచారణ..
డిసెంబర్ 11న ఓటరు గణన దశ ముగిసింది. 16న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. 58 లక్షల ఓటర్ల పేర్లు జాబితాలో లేవు. దీని తరువాత గురువారం నుంచి ఓటర్లను విచారణల కోసం పిలవడం ప్రారంభించాల్సి ఉంది. కానీ అది జరగలేదు. కమిషన్ మొదట్లో CCTV కెమెరాలపై ఆధారపడాలని ప్రణాళిక వేసింది. కానీ తరువాత క్షేత్రస్థాయిలో విధానపరమైన అవకతవకలను గుర్తించడానికి కెమెరాలు సరిపోవని తేల్చి, అందువల్ల పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది.

