ఐ ఫోన్ల తయారీ కంపెనీలో పెళ్లయిన మహిళలకు నో జాబ్ !
x

ఐ ఫోన్ల తయారీ కంపెనీలో పెళ్లయిన మహిళలకు నో జాబ్ !

చెన్నై శ్రీపెరంబుదూర్‌లో ఐ ఫోన్ల తయారీ పరిశ్రమలో పెళ్లయిన మహిళలను ఉద్యోగంలోకి తీసుకోవడం లేదన్న వార్తలపై కంపెనీ సమాధానం ఏమిటి?


చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ పరిశ్రమ ఫాక్స్‌కాన్‌లో పెళ్లయిన మహిళలను ఉద్యోగంలోకి చేర్చుకోవడం లేదని మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో కంపెనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తమ కంపెనీలో మహిళలకే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొంది. 75 శాతం మంది మహిళలు, 25 శాతం మంది పురుషులు పనిచేస్తున్నారని, ఈ 75 శాతం మహిళల్లో కూడా 25 శాతం మంది పెళ్లయిన మహిళలే ఉన్నారని క్లారిటీ ఇచ్చింది.

బంగారు ఆభరణాలను అనుమతించడం లేదని వచ్చిన వార్తలపై కూడా కంపెనీ సమాధానమిచ్చింది. హిందూ వివాహిత మహిళలు ఆభరణాలు ధరించడం పట్ల కూడా వివక్ష చూపడం లేదని, కాకపోతే అవి విలువైనవి కావడంతో భద్రతా సమస్య తలెత్తుతుందని పేర్కొంది.

ఇదిలావుండగా కంపెనీలోకి వివాహిత మహిళలను పనికి అనుమతించకపోవడంపై కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరింది.

సమాన వేతన చట్టం 1976 సెక్షన్ 5 ప్రకారం.. స్త్రీ, పురుషులను రిక్రూట్ చేసుకునే సమయంలో వివక్ష చూపకూడదని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో సూచించింది.

Read More
Next Story