వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన
x
వైఎస్సార్సీపీ మహిళా ప్రెసిడెంట్ వరుదు కళ్యాణిని అడ్డుకున్న పోలీసులు

వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన

ఏపీలో మహిళలకు రక్షణ కల్పించాలంటూ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించిన వైఎస్సార్సీపీ


రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు నిరసన తెలుపుతూ రాష్ట్ర వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. నిరసన కారులను పలు జిల్లా కేంద్రాల్లో పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్ర నినాదంతో ఈ ఆందోళన జరిగింది.


అనంతపురంలో నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు

మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇంత మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఇంకెవరికి మహిళలు చెప్పుకోవాలన్నారు. అదేమిటని ప్రశ్నిస్తే నాదగ్గరేమైనా గన్ ఉందా అంటూ ఎటకారంగా హోం మంత్రి అనిత మాట్లాడుతున్నారని, ఇది మహిళలను అవమానించడమేనని మాజీ మంత్రి ఆర్ కె రోజా ఆక్షేపించారు. నగరి నియోజకవర్గంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే అక్కడ ఉన్న మహిళ ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. 14 మంది అత్యాచారానికి పాల్పడిన వాళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారని ఆరోపించారు.

రాష్ట్రోంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం వారు అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Read More
Next Story