లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
x

లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు


ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్‌ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షలతో రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు. రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వారంలో రెండు రోజులు ఏసీబీ కోర్టుకు హాజరుకావాలనే కండీషన్ కింద బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు జడ్జి.
ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిధున్ రెడ్డి.. 71 రోజులు జైలులో ఉన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. లిక్కర్ కేసులో 2025, జూలై 19వ తేదీన విజయవాడలోని సిట్ ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. ఏడు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత.. సరైన సమాధాలు చెప్పలేదని.. లిక్కర్ స్కాంలో ఎంపీ మిధున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేశారు అధికారులు. అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచి.. ఆ తర్వాత రిమాండ్ కింద రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు.
పలుసార్లు బెయిల్ పిటీషన్ డిస్మస్ అయ్యింది. ఛార్జిషీటు ఇంకా దాఖలు చేయకపోవటంతో ఏసీబీ కోర్టు షరతులతో బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
మిథున్‌ రెడ్డి జులై 19న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ దక్కింది. ఆ గడువు ముగిశాక మళ్లీ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Read More
Next Story