ఓటమి బాటలో వైఎస్సార్సీపీ మంత్రులు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటమి అంచున్న ఉంది. కౌంటింగ్ రోజు మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమి 158 స్థానాల్లో ముందంజలో ఉంది. 17 స్థానాల్లో వైెఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది.
వైఎస్సార్సీపీ మంత్రులు 15 మంది ఓటమి బాట పట్టారు. ముఖ్యులందరూ ఉండటం విశేషం. రాష్ట్ర వ్యాస్తపంగా ఎన్డీఏ కూటమి గెలుపు దిశగా దూసుకుపోతున్నది. మొదటి నుంచీ ది ఫెడరల్ చెప్పినట్లుగానే తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో విజయం వైపు వెళుతోంది. ప్రధానంగా మంత్రులు పలువురు ఓటమి బాట పట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంతో సీనియర్ నాయకులు అనుకున్న వారు కూడా మట్టి కరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి స్పష్టమైన తీర్పు ఇస్తూ వస్తున్న విషయాన్ని కూడా పలు మార్లు ది ఫెడర్ చెబుతూ వచ్చింది. అభివ్రుద్ధి సంక్షేమానికి సంబంధించిన విషయంలో ప్రజలు సంక్షేమంతో పాటు అభివ్రుద్ధి కూడా కావాలని అనే విషయం ఇప్పటికి కాని పాలకులకు అర్థం కాలేదు.
ఉదయం 11.30 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ 130 స్థానాల్లోనూ, జనసేన 19 స్థానాల్లోనూ, బిజెపి 7 స్థానాల్లోనూ, వైఎస్సార్సీపీ 18 స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి. ఈ ఆధిక్యంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూటమి 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. పలువురు మంత్రుల నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి ఆధిక్యత కొనసాగటం అంటే వారు ఓటమి బాటలో ఉన్నారనేందుకు స్పష్టమైన సంకేతాలు ఓటర్లు ఇచ్చినట్లైంది. ప్రధానంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ తన బావమరిది చేతిలో ఓటమి చెందబోతున్నారు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ ఆధిక్యంలో ఉన్నారు.
రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఉష శ్రీచరణ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కె రోజా వంటి మంత్రులు ఓటమి బాటలో ఉండటం విశేషం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తిరుగులేదని భావిస్తున్న తరుణంలో ఆ రెండు జిల్లాల్లోనూ మంత్రులు కూడా ఓటమి బాటలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.