
అమృత స్కీమ్ పథకాన్ని వైసీపీ నిర్వీర్యం చేసింది
నెల్లూరులో రూ. 339 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీరని నష్టం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. అంతేకాకుండా అమృత స్కీమ్ పథకాన్ని కూడా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజక వర్గంలో గురువారం రూ. 339 కోట్ల అభివృద్ధి పనులు మంత్రి నారాయణ ప్రారంభించారు.
అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పనులు ఎక్కడా చేపట్టలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చినత తర్వాత నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్ వర్కులు చేపట్టినట్లు చెప్పారు. త్వరలో పొట్టేపాలం వద్ద వంతెనకు కూడా నిధులు మంజూరు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు నగరంలో ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి శుద్ధి ప్లాంట వంటి పెండింగ్‌లో ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి, నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
Next Story