జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లకు వైసీపీ ఫిర్యాదు
x

జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లకు వైసీపీ ఫిర్యాదు

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో అక్రమాలు జరిగాయని జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లకు వైసీపీ నాయకులు ఫిర్యాదులు చేశారు.


పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే అధికార దుర్వినియోగ్యానికి పాల్పడిందని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అరకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ డాక్టర్‌ గుమ్మ తనుజా రాణి, వైఎస్‌ఆర్‌సీపీ పులివెందుల ఉపాధ్యక్షుడు, కౌన్సిలర్‌ పార్నపల్లి కిషోర్, ఎర్రబల్లి పంచాయతీ సర్పంచ్‌ మునీంద్ర, ఆ పార్టీ ఎస్టీ నాయకులు మహేష్‌ నాయక్, మోతీలాల్‌ నాయక్, మండల ఎస్సీ నాయకులు ఓబులేసు జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ అంతార్‌ సింగ్‌ ఆర్యను, జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ మక్వానను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు దిగిన రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ల చైర్మన్లకు సమర్పించిన వినతి పత్రంలో కోరారు.

Read More
Next Story