వక్ఫ్ చట్టాల సవరణపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ
వక్ఫ్ బిల్లు వక్ఫ్ బోర్డుల నుంచి అస్తులను కొల్గగొట్టేందుకు తీసుకుంటున్నచర్య. వక్ఫ్ నిర్వచణం మార్చే అధికారం పార్లమెంటుకు లేదు: హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకు రావడాన్ని ఏపీలోని ముస్లిమ్ సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ముస్లిమ్‌ల్లో ధనవంతులు భగవంతునిపై నమ్మకంతో పేదల బాగు కోసం వారి ఆస్తులను దానం ఇస్తే వాటిని వక్ఫ్‌బోర్డులో ఉంచడం ద్వారా సేవ చేసుకునే భాగ్యం నేటి ముస్లిమ్‌లకు కలిగిందని, అటువంటి చట్టానికి తూట్లు పొడవడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్‌డీఏకు సపోర్టు చేయడాన్ని ముస్లిమ్ నాయకులు ఖండిస్తున్నారు. ఏపీలో వైఎస్సార్‌సీపీ ఈ చట్ట సవరణలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పలు చోట్ల ముస్లిమ్ మత పెద్దలు మీడియాతో మాట్లాడుతూ వ్యతిరేకించారు.
చట్ట సవరణను ఖండించిన అంజాద్‌బాషా
వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిగా ఖండిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌బాషా అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టంపై ఆయన మండిపడ్డారు. వక్ఫ్ చట్టంలో ఎన్‌డీఏ ప్రభుత్వం చేయాలనుకున్న సవరణలు ఎవరూ ఆమోదించరు, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా సవరణలకు సిద్దమవడం దారుణం, మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాన్ని ఎన్‌డీఏ సర్కార్ చేస్తున్నది. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేస్తే అది ఎప్పటికీ వక్ఫ్‌దే, ఈ చట్టాన్ని సవరించడం దుర్మార్గం, ఎన్‌డీఏ ప్రభుత్వం మైనార్టీలను శత్రువులుగా చూస్తోందన్నారు. దేశంలో 9 లక్షల ఎకరాల ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి, ఈ సవరణల ద్వారా కాజేయాలనే ప్రయత్నం జరుగుతోంది. వక్ఫ్ నిర్వచనాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కాలరాసే ప్రయత్నం కూడా చేస్తున్నారు, రాబోయే రోజుల్లో వక్ఫ్ ఆస్తులు, భూములు ప్రభుత్వ పరం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. ఎక్కడైనా వక్ఫ్ భూములు ఉంటే దానిపై బోర్డుకున్న అధికారాలు కూడా తొలగించే కార్యక్రమం జరుగుతోంది. వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ పూర్తిస్థాయిలో ఖండిస్తుందన్నారు.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకించిన హఫీజ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పార్లమెంటు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది అల్లాకు సంబంధించినది. ఒక ముస్లిం తన ధర్మం కోసం, సమాజ సంక్షేమ కోసం మేలు చేయడానికి ఇచ్చిన ప్రాపర్టీ అని అన్నారు. ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కోనుగోలు, అమ్మాకాలు చేయరాదన్నారు. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని సమాజం మేలు కోసం ఉపయోగించాలి. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ధర్మానికి సంబంధించిన విషయాలను పూర్తిగా స్వేచ్ఛ తో ఆలోచించాలన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ బిల్లులో అంశాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కు పూర్తి అధికారం ఇవ్వడం, వక్ఫ్ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేయడమేనన్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా ఈ బిల్లు వల్ల తొలగిస్తారన్నారు. వక్ఫ్ బోర్డులో నియామకాలను నామినేటెడ్ పద్దతి ద్వారా తీసుకునే యంత్రాన్ని కూడా తీసి వేయడం, ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ జడ్జిలను, ముస్లిం సోదరులను వక్ఫ్‌బోర్డు నుంచి తొలగించడాన్ని అంగీకరించేది లేదన్నారు. ఇతర మాతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నామినేటెడ్ చేసేందుకు ఈ బిల్లులో పొందుపరుచారు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంటులో ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి వ్యతిరేకించారన్నారు. ఇది ముస్లిమ్ సోదరులకు సంబంధించిన సున్నితమైన విషయంగా పునరాలోచనలో చేయాలన్నారు. తెలుగు దేశం పార్టీ ఎన్నికల ముందు ముస్లిం సమాజానికి ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి మద్దతు ఇవ్వడం చాలా దారుణం, ఇది ముస్లింలు గమనిస్తున్నారన్నారు. ఏ మాట ఇచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ముస్లిం సోదరుల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
Next Story