
వైఎస్ వివేకా కేసు.. సీబీఐకి సుప్రీం మూడు ప్రశ్నలు
ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణలో ట్విస్ట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణలో భాగంగా మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది.మూడు అంశాలపై కోర్టుకు స్పష్టత ఇచ్చిన తరువాత నిందితుల బెయిల్ రద్దు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది.
సీబీఐ కి సుప్రీం ప్రశ్నలివే..
వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా?
కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏమిటి?
కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా?
తాము అడిగిన ఈ మూడు అంశాలపై జవాబీయాలని తరువాతనే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.ఈ కేసులో అవినాశ్ రెడ్డి సహా ఇతర నిందితుల బెయిల్ రద్దు కోరుతూ వివేకా కూతురు సునీత, సీబీఐ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇంతకుముందు అవినాశ్ తో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ, సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.ఆ పిటీషన్లపై సోమవారం విచారణ జరిగింది.
Next Story