దళిత వాడల్లో టీటీడీ గుళ్లు కాదు బడులు కట్టండి!
x

దళిత వాడల్లో టీటీడీ గుళ్లు కాదు బడులు కట్టండి!

చంద్రబాబుకు వైఎస్ షర్మిల సలహా, ఆయనేమైనా ఆర్ఎస్ఎస్ లో చేరారా? అని ప్రశ్న


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు RSS వాదిలా మారిపోయారు. మిత్రధర్మం పేరుతో బీజేపీ, RSS సిద్ధాంతాలను నెత్తినపెట్టుకుంటున్నారు" అని విమర్శించారు.

"మన రాజ్యాంగం అన్ని మతాలకు స్వేచ్ఛ ఇస్తుంది. కానీ చంద్రబాబు RSS రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. RSS సిద్ధాంతంలో హిందువులు మాత్రమే మనుషులు, మిగతా మతస్తులను పురుగులా భావిస్తారు. ఇలాంటి ఆలోచనలను ఆమోదించలేం" అని షర్మిల అన్నారు. చంద్రబాబు తన ధోరణిని మార్చుకోవాలని సలహా ఇచ్చారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ఓటర్ల జాబితాలో మార్పులు చేసి, ఓట్లను చేర్చడం, తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసిందని షర్మిల ఆరోపించారు. "ఎన్నికల సంఘం కూడా బీజేపీ గుప్పిట్లో ఉంది. రాహుల్ గాంధీ చూపించిన ఆధారాలు ఉన్నప్పటికీ స్పందన లేదు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించింది" అని ఆమె స్పష్టం చేశారు. దళితవాడల అభివృద్ధిపై దృష్టి సారించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
TTD నిధులతో 5 వేల గుడుల నిర్ణయం
TTD నిధులతో దళితవాడల్లో 5 వేల గుడులు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు షర్మిల ప్రస్తావించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
"దళితవాడల్లో ఎవరు గుడులు కట్టమన్నారు? ఆ నిధులను హాస్టళ్లలో కనీస వసతులు కల్పించడానికి ఉపయోగించండి. SC వెల్ఫేర్ హాస్టల్లో 200 మందికి ఒకే బాత్‌రూమ్ ఉంది. ఆ పిల్లల కోసం డబ్బు ఖర్చు చేయాలి" అని ఆమె డిమాండ్ చేశారు. "గుడులు కట్టడం కాకుండా దళితవాడల్లో పారిశుధ్యం, విద్యా సదుపాయాలు, హాస్టల్ వసతులు మెరుగుపరచాలి. చంద్రబాబు RSS మార్గాన్ని అనుసరించడం దురదృష్టకరం" అని షర్మిల అన్నారు.
Read More
Next Story