మద్యం స్కాంపై షర్మిల సంచలనం
x

మద్యం స్కాంపై షర్మిల సంచలనం

డిజిటల్ పేమెంట్ ఆపడం‌ వెనుకే అసలు అవినీతి ,జగన్ సమాధానం చెప్పాలి


వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వాస్తవాలెన్నింటినో వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.ఇది ఓ ఆర్థిక నేరమని.. బ్లాక్‌ మనీ కోసమే డిజిటల్‌ పేమెంట్‌ను నిలిపివేశారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి కొనుగోలు వరకు అవినీతి జరిగిందని అన్నారు.ప్రజలకు మాజీ సీఎం జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కేవలం నగదు రూపంలో అమ్మకాలు అందులోనే పెద్ద స్కాం వుందన్నారు.క్యాష్‌తోనే అమ్మకాలు చేశారు,ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలన్నారు.

ఇది రూ.3500 కోట్ల మద్యం స్కాం మాత్రమే కాదు, పన్నులు ఎగ్గొట్టాలని,నాన్‌ డ్యూటీ పేమెంట్‌లు మొత్తం బ్లాక్‌లో జరిగాయని షర్మిల అన్నారు.బ్రాండెడ్‌ మద్యాన్ని నిలిపివేసి చీప్‌ లిక్కర్‌ను ఎందుకు ప్రోత్సహించారు,ఐదేళ్లలో 30లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయి. 30వేల మందికి పైగా చనిపోయారని లెక్కలు చెప్పారు. సిట్, సీఎం చంద్రబాబు ఈ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
Read More
Next Story