సీఎం పదవికి జగన్ రాజీనామా..
x

సీఎం పదవికి జగన్ రాజీనామా..

ఆంధ్ర ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓటమి పాలయింది. 175 అసెంబ్లీ సీట్లకు జరిగిన పోటీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 161 సీట్లో విజయం సాధించింది.


ఆంధ్ర ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓటమి పాలయింది. 175 అసెంబ్లీ సీట్లకు జరిగిన పోటీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 165 సీట్లో విజయం సాధించింది. అధికార వైసీపీ మాత్రం 10 సీట్లకే పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందించారు. అంతకుముందు ఆయన ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేకపోయానన్నారు. ప్రజలకు చేసిన మంచి, ప్రజలు తనపై చూపిన ఆప్యాయత ఏమైందో అర్థం కాలేదన్నారు.

Read More
Next Story